మాజీ ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ అక్రమమని ఆందోల్ మాజీ ఎం ఎల్ ఏ క్రాంతి కిరణ్ అన్నారు. పేదలకు, రైతులకు,మహిళలకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్ట్ లతో గొంతు నొక్కా లని చూస్తోందని ఆయన అన్నారు. నోటీస్ లు ఇవ్వడానికి అని చెబుతూ తెల్లవారుజామున ఇంట్లోకి దౌర్జన్యంగా పోలీసులు రావడం తీవ్ర ఆక్షేపనీయం. కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసేలా నీచంగా వ్యవహరించి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజాపాలన పేరు చెప్పి హామీల అమలు కోసం ప్రశ్నించే గొంతుల హక్కులను కాలరాస్తున్నారు. ఆరు గ్యారంటీలు 13 హామీలు అమలు చేయలేక ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత నుండి దృష్టి మరల్చడానికి ఇలాంటి అక్రమ అరెస్ట్ లతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ ను బేషరతుగా వెంటనే విడుదల చేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని క్రాంతి అన్నారు.