నిర్మల్ జిల్లా భైంసా పట్టణం లో దాబాలు, బెల్టు బెల్ట్ షాప్ లపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేశారు. అక్రమంగా మద్యం అమ్ముతున్న భైంసా పిప్రి కాలనీ కి చెందిన కదం ప్రేమలను ఈ సందర్భంగా అరెస్టు చేశారు. ఆమె నుంచి దాదాపు 5520/- రూపాయలు విలువ గల 4.6 లీటర్స్ మద్యం ను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా దాబాలలో మద్యం విక్రయించినా, బెల్ట్ షాప్ లు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, ఎక్సైజ్ పోలీసులు హెచ్చరించారు.