37.2 C
Hyderabad
April 19, 2024 12: 53 PM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ ప్రాంతంలో పెద్దఎత్తున నల్లబెల్లం స్వాధీనం

#Kollapur Exicse Police

అక్రమ సారాకు ఉపయోగించే నల్లబెల్లం, పటిక నిల్వలను ఎక్సైజ్ పోలీసులు భారీ ఎత్తు స్వాధీనం చేసుకున్నారు. కొల్లాపూర్ మండలంలోని పలు గ్రామాలలో ప్రతి రోజూ నిర్వహించే రూట్ వాచ్ లో భాగంగా ఎక్సైజ్ పోలీసులు ముక్కిడిగూడెం గ్రామంలో తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా 80 కార్టన్ల నల్లబెల్లం, పటిక స్వాధీనం చేసుకున్నట్లు కొల్లాపూర్ ఎక్సైజ్ సిఐ ఏడుకొండలు తెలిపారు. ఇందులో మొత్తం 1600 కిలోల నల్లబెల్లం, 50 కిలోల పటిక ఉన్నాయి.

ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఒక అశోక్ లైలెండ్ మిని ట్రక్ ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా వంద లీటర్ల వాష్ ను ఐదు లీటర్ల అక్రమ సారాను ధ్వంసం చేసినట్లు కొల్లాపూర్ ఎక్సైజ్ సిఐ ఏడుకొండలు తెలిపారు.

Related posts

యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్లను సత్కరించిన నరసరావుపేట ఆర్టీసీ డిపో

Satyam NEWS

ఎ బిగ్ క్వశ్చన్: 35 వేల కోట్ల రూపాయలు ఏం చేశారు?

Satyam NEWS

నెల్లూరు కోర్టు చోరీ కేసు సుమోటో గా స్వీకరించిన ఏపీ హైకోర్టు

Satyam NEWS

Leave a Comment