28.2 C
Hyderabad
April 30, 2025 05: 16 AM
Slider తెలంగాణ

మత్తులో జోగుతున్న ఆబ్కారీ ఆఫీసు

pjimage (12)

ఆబ్కారీ ఆఫీసు అంటే ఏమిటి? ఏమిటి అనే ప్రశ్న ఎందుకన్నా… ఆబ్కారీ ఆఫీసు అంటే మందు కొట్టు స్థలము.. అంటున్నాడు ఈ కానిస్టేబుల్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోని నుల్తలాపూర్ గ్రామంలో ఒక వైన్స్ షాప్ లో ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతున్నారని ఫిర్యాదు చేసేందుకు సిపిఐ మండల కార్యదర్శి బోయిని తిరుపతి ఆధ్వర్యంలో ఆ గ్రామస్థులు ధర్నా చేశారు. ఆ తర్వాత ఫిర్యాదు చేసేందుకు ఎక్సయిజ్ కార్యాలయానికి వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లి చూసే సరికి కార్యాలయంలో విధులు నిర్వర్తించాల్సిన కానిస్టేబుల్ ఒక ప్రయివేటు వ్యక్తి తో కలిసి మందు కొట్టడంలో బిజీగా ఉన్నాడు. మంచిగా ఆమ్లేట్ వేసుకుని నంజుకుంటూ మందు కొడుతున్న ఆ ముచ్చటైన దృశ్యాలను సిపిఐ కార్యకర్తలు కెమెరాల్లో బంధించారు. మరి ఆబ్కారీ ఆఫీసులు ఇంత చక్కగా పని చేస్తున్నాయి కాబట్టే వైన్స్ షాపుల వాళ్లు వాళ్ల ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముతున్నారు. బహుశ ఈ ఎక్సయిజ్ ఆఫీస్ లో కొట్టే మందు బాటిల్స్ కూడా ఆ వైన్ షాపుల వారు ఉచితంగా ఇచ్చిందే అయి ఉంటుంది. పండుగ సీజన్… ఫ్రీ మందు.. ఇంకే అది ఆఫీస్ అయినా… ఇల్లయినా మందు కొట్టాల్సిందే కదా

Related posts

విలేజ్ గాడ్: వైభవంగా పోలేరమ్మ విగ్రహ ప్రతిష్టాపన

Satyam NEWS

కాంట్రవర్సీ: ఇద్దరు ఐఏఎస్ అధికారులూ, ఒక జగను

Satyam NEWS

కామారెడ్డి విశ్వకర్మ కార్పెంటర్ అసోసియేషన్ ఎన్నిక

mamatha

Leave a Comment

error: Content is protected !!