27.7 C
Hyderabad
March 29, 2024 03: 04 AM
Slider పశ్చిమగోదావరి

హుజూరాబాద్ పై ఎగ్జిట్ పోల్స్ నిషేధం

#rvkarnanias

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించకూడదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రజా ప్రాతినిథ్య చట్టం 1951, సెక్షన్ 126 (ఎ) ప్రకారం అక్టోబర్ 30 రాత్రి 7.30 గంటల వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్ నిర్వహించరాదని, ప్రింట్ మీడియా లో ప్రచురించరాదని, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారాలు చేయరాదని, ఇతర మాధ్యమాల ద్వారా  ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం నిషేధించినట్లు ఆయన తెలిపారు. 

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అతిక్రమించి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన, ప్రింట్ మీడియాలో ప్రచురించిన, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారాలు  చేసిన ఎన్నికల నిబంధనల మేరకు శిక్షార్హులని ఆయన తెలిపారు.

Related posts

హుజూర్ నగర్ ఎంపిపి శ్రీనివాస్ కు రఘు పరామర్శ

Bhavani

పత్తికొండలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి

Satyam NEWS

చంద్రబాబు మాజీ పిఏ వద్ద 150 కోట్లు దొరికాయా?

Satyam NEWS

Leave a Comment