కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని పలు ఫర్టిలైజర్ షాప్ లలో, డీలరు షాపులు, ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు గోదాముల్లో ప్రత్యేక అధికారి ఏడీఈ చంద్రకళ, వ్యవసాయ శాఖ కార్యాలయం సిబ్బంది, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం తనిఖీలు నిర్వహించారు.
ఫెర్టిలైజర్ షాపుల యాజమానులు నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని ఏడీఏ చంద్రకళ, టాస్క్ ఫోర్సద ఎస్‌ఐ సందీప్ పేర్కొన్నారు. సోమవారం పలు ఫెర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వారు మాట్లాడుతూ రికార్డులను సక్రమంగా మెయింటెన్ చేయాలని, రైతులు కొన్న విత్తనాలు, ఎరువులకు రశీదులు అందించాలన్నారు.
నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయించవద్దని సూచించారు. ప్రభు త్వ నిబందనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ తనిఖీలలో విత్తన ధ్రువీకరణఅధికారి దుర్గేష్, టాస్క్ఫోర్ ఎస్ఐ సందీప్, కానిస్టేబుల్ మధు, రమేష్ సంజీవ్ లు పాల్గొన్నారు