ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించి, గత ఎనిమిది రోజులు గా చేస్తున్న సమ్మెను విరమింపజేయాలని, ప్రజారవాణా వ్యవస్థను కాపాడాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యుఎస్పీసీ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సమ్మె కార్మికుల చట్టబద్దమైన హక్కని, సమ్మెను నిరంకుశంగా అణచివేసి ఉద్యోగులను తొలగించామనటం అప్రజాస్వామిక చర్యగా యుయస్పీసీ విమర్శించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ ఐక్యంగా ఆర్టీసీ కార్మికులకు బాసటగా నిలవాలని యుయస్పీసీ కోరింది. సమ్మె సాకుతో పాఠశాలలకు దసరా సెలవులు పొడిగించటాన్ని యుయస్పీసీ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వం పట్టుదలకు పోయి లక్షలాది మంది విద్యార్థులను నష్ట పెట్టడం ఎంతవరకు సమంజసం అని యుయస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు సిహెచ్ రాములు, సిహెచ్ రవి(టిఎస్ యుటిఎఫ్), వై అశోక్ కుమార్, మైస శ్రీనివాసులు(టిపిటిఎఫ్), ఎం రఘుశంకర్ రెడ్డి, టి లింగారెడ్డి(డిటిఎఫ్) యు పోచయ్య, డి సైదులు(ఎస్టీఎఫ్), సయ్యద్ షౌకత్ అలీ, ఎన్ చెన్న రాములు(టిఎస్పీటిఎ), కొమ్ము రమేష్, ఎస్ బాబు( బిటిఎఫ్), జాడి రాజన్న, జాదవ్ వెంకట్రావు( ఎస్సీఎస్టీ టిఎ – టి), మసూద్ అహ్మద్, ముజిబుర్ రహమాన్(టియుటిఎ), ఎ గంగాధర్, ఎం పద్మారావు(టిపిఎస్ హెచ్ఎంఏ), ఎస్ హరికృష్ణ, శ్రీను నాయక్(టిటిఎ), శాగ కైలాసం, చింతా రమేష్(ఎస్సీఎస్టీ యుయస్), బి కొండయ్య, ఎస్ మహేశ్(టిఎస్ ఎంఎస్టీఎఫ్), కుర్సం రామారావు, ఎస్ లక్ష్మీనారాయణ(ఎటిఎఫ్) లు ప్రశ్నించారు. పాఠశాలలను యధాతథంగా పునఃప్రారంభించాలని యుఎస్పీసీ డిమాండ్ చేసింది.
previous post