35.2 C
Hyderabad
April 24, 2024 11: 10 AM
Slider కడప

అక్రమ సంబంధమే శ్రీనివాసులు హత్య కేసుకు కారణం

kadapa police

కడప పట్టణంలో రెండు రోజుల కిందట జరిగిన ఒక హత్య కేసు మిస్టరీని చిన్నచౌక్ పోలీసులు ఛేదించారు. ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాసులు హత్య కేసుకు మూల కారణం అక్రమ సంబంధమేనని పోలీసు విచారణలో తేలింది. పట్టణంలో రెండు రోజుల క్రితం శ్రీనివాసులు హత్యకు గురైన విషయం తెలిసిందే.

శ్రీనివాసులు కు నగరంలోని ఒక నర్సింగ్ హోంలో పని చేస్తున్న నర్స్ సృజనతో వివాహేతర సంబంధం ఉంది. అయితే సృజన మరో యువకుడితో వివాహానికి సిద్దపడింది. మరోకరితో వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని శ్రీనివాసులు, సృజనను వేధింపులకు గురి చేశాడు. అంతే కాకుండా ఆత్మహత్య చేసుకుంటానని ఆమెను బెదిరించాడు.

నర్సింగ్ హోమ్ లో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రూమ్ లోకి వెళ్ళి చీర బిగించుకోని ఆత్మహత్య చేసుకుంటానని  శ్రీనివాసులు ఆమెను బెదిరించాడు. ఈ క్రమంలో ఇద్దరి మద్య పెనుగులాట చోటు చేసుకున్నది.

ఈ పెనుగులాటలో శ్రీనివాసులు తన మెడకు తానే వేసుకున్న చీర బిగుసుకున్నది. దాంతో శ్రీనివాసులు మృతి చెందాడు. నిందితురాలు సృజన ను అరెస్ట్ చేసి చిన్నచౌకు పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితురాలిని మీడియా ఎదుట హాజరు పరచి ఎస్ఐ అశోక్ రెడ్డి,  ఎస్ఐ రోషన్, సత్యనారాయణ  వివరాలు వెల్లడించారు.

Related posts

రోజా ఈ సారి ఓడిపోవడం ఖాయం… ఎందుకంటే…

Satyam NEWS

మైనింగ్ పేరుతో సాగు భూములు లాక్కుంటున్నారు

Satyam NEWS

అన్ని రంగాల్లో ఘన విజయం సాధిస్తున్న మహిళలు

Satyam NEWS

Leave a Comment