27.7 C
Hyderabad
April 24, 2024 08: 47 AM
Slider రంగారెడ్డి

మంచి కంటి చూపు కోసం  20-20-20 నియమం పాటించాలి

#eyecamp

సిబిఐటి కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యం లో స్మార్ట్ విషన్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో   అధునాతన వైద్య పరికరాలతో  విద్యార్థులకు మరియు అధ్యాపకులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. సుమారుగా 500 విద్యార్థులు, 300 అధ్యాపకులు  ఈ సౌకర్యం ను వినియోగించుకున్నారు.  ఈ సందర్బo గా డాక్టర్ కల్పన మాట్లాడుతూ కళ్ళ చూపు  మెరుగుపరచడానికి, కంటి ఆరోగ్యాన్ని నిర్వహించడానికి పాటించాల్సిన పద్ధతులు గురించి వివరించారు. 

ఆకు కూరలు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే చేపలతో కూడిన ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి. కళ్ళు ఆరోగ్యంలో ముఖ్యమైన భాగం. చాలా మంది వ్యక్తులు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడటానికి, అర్థం చేసుకోవడానికి వారి కళ్ళపై ఆధారపడతారు. కానీ కొన్ని కంటి వ్యాధులు దృష్టిని కోల్పోయేలా చేస్తాయి కాబట్టి వీలైనంత త్వరగా కంటి వ్యాధులను గుర్తించి చికిత్స చేయడం చాలా ముఖ్యం.

ఎక్కువ సమయం కంప్యూటర్‌తో గడిపినట్లయితే,  కళ్ళు రెప్పవేయడం మర్చిపోవచ్చు మరియు కళ్ళు అలసిపోతాయి. మంచి కంటి చూపు కోసం  20-20-20 నియమాన్ని పాటించాలి. ప్రతి 20 నిమిషాలకు, 20 సెకన్ల పాటు, 20 అడుగుల దూరాన్ని  చూడాలి అని చెప్పారు. ప్రతిరోజూ, మనం కనీసం 15 నిమిషాలు సూర్యరశ్మి లో గడపాలి. కళాశాల ప్రిన్సిపాల్ పి రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ శర్మ, ప్రొఫెసర్ గణేష్ రావు, ప్రొఫెసర్ యెన్ వి కోటేశ్వర రావు, ప్రొఫెసర్ వై రమ దేవి, కళాశాల పి ఆర్ ఓ డాక్టర్ జి ఎన్ ఆర్ ప్రసాద్, స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్స్ మార్కెటింగ్ హెడ్ శ్రీ అబ్దుల్ వహీద్, ఇతర విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Related posts

బెనిఫిట్… బెనిఫిట్… బెనిఫిట్: వెన్నెముక లేని పెద్ద హీరోలు

Satyam NEWS

ఓటర్లకు డబ్బులు పంచే పార్టీలను రద్దు చేయాలి

Satyam NEWS

ఈ సమయంలో ఆన్ లైన్ కు ప్రత్యామ్నాయం ఇది

Satyam NEWS

Leave a Comment