26.7 C
Hyderabad
May 1, 2025 05: 30 AM
Slider ఆంధ్రప్రదేశ్

స్వార్ధం ఎరుగనిది నేత్రదానం ఒక్కటే

vijayasaireddy

అన్నదానం, విద్యా దానం, శ్రమదానం, కన్యాదానం, రక్తదానం ఇలా ప్రపంచంలో ఎన్నో రకాల దానాలు ఉన్నాయి గాని స్వార్ధం అంటూ ఎరుగని ఏకైక దానం నేత్రదానమని విశ్వాస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు బి పద్మావతి అన్నారు. విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మ దిన సందర్భంగా పద్మావతి తన నేత్రదాన అంగీకార పత్రాన్ని  విశాఖ ఐ బ్యాంకు కు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి  రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమక్షంలో అందజేశారు.

ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి  మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు పద్మావతి చేస్తున్న కార్యక్రమాలను కొనియాడుతూ నేత్రదాన నిర్ణయం ఎంతో అభినందనీయని అన్నారు. నేత్ర దానం చేయడం వల్ల ఇద్దరు అంధులకు కంటి చూపు కలుగుతుందని, ప్రతి ఒక్కరూ ఈ దిశగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. మున్ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. 

ప్రతి అవయవం ప్రాణ బీజం అయ్యేలా నీ గతీ గమ్యం అనంత ధామం అయ్యేలా అంధకారమైన జీవితానికి తొలి వెలుగులు నింపేలా కొన్ని కుటుంబాలు చిరునవ్వుకి ఆధారం అయ్యేలా పద్మావతి సేవలు ఉన్నాయని ప్రతి ఒక్కరు కూడా ఆమె ని ఆదర్శంగా తీసుకుని అవయవ దానానికి ముందుకు రావాలని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వి ఎమ్ ఆర్ డి ఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్,  ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి స్థానిక ఎంపీ ఎంవివి సత్యనారాయణ నగర పార్టీ అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ  రాజీవ్ గాంధీ, రవి రెడ్డి, పక్కి దివాకర్, విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కే కే రాజు, కొయ్య ప్రసాద్రెడ్డి, వెంపటి శ్రీనివాస్ రెడ్డి  లతోపాటు అధిక సంఖ్యలో పార్టీ నాయకులు శ్రేణులు ప్రజలు పాల్గొన్నారు.

Related posts

విహార యాత్రలో రోడ్డు ప్రమాదం: విద్యార్ధులకు గాయాలు

Satyam NEWS

శ్రీలంక తదుపరి ప్రధానిగా రణిల్ విక్రమసింఘే

Satyam NEWS

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!