దిశ నిందితుల ఎన్ కౌంటర్ స్థలం నుంచి అధికారికంగా వాస్తవ పరిస్థితిని DMHO శ్రీనివాస్ నాయక్ వెల్లడించారు. ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో నాలుగు మృతదేహాలు 20 నుంచి 30 అడుగుల దూరంలో పడి ఉన్నాయని ఆయన తెలిపారు. ఘటన స్థలంలో ఇప్పటికే ఉన్న క్లూస్ టీమ్స్ తో పాటు, ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పోలీసులు శవాలకు పంచనామా నిర్వహించారు.
ఫోరెన్సిక్ నిపుణులు గాంధీ ఆసుపత్రి నుండి ఘటనా స్థలానికి చేరుకున్నారు. నలుగురికి పోస్ట్ మార్టం జరిపిన అనంతరం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి ఈ మృత దేహాలను తరలిస్తారు. ఆ తర్వాత ఆ మృత దేహాలను నలుగురు సంబంధిత ఎమ్మార్వోలకు అప్పగిస్తారు. ఫరూఖ్ నగర్, కుందూర్, నందిగామ, చౌదరి గూడ ఎమ్మారోలు ఈ మృత దేహాలను స్వాధీనం చేసుకుని ఆ తర్వాత వాటిని వారి కుటుంబ సభ్యులకు అందచేస్తారు.
ఒక వేళ కుటుంబ సభ్యలు ఆ మృత దేహాలను తీసుకోకపోతే రెవెన్యూ సిబ్బంది ఖననం చేస్తారు.