37.2 C
Hyderabad
March 29, 2024 19: 00 PM
Slider మహబూబ్ నగర్

మాస్కులను పంపిణీ చేసిన ఎసై కొంపల్లి మురళి గౌడ్

Vanga Rajasekhar Gowd

కరోనా వైరస్ వ్యాధి ప్రజలను పట్టి పీడిస్తున్న తరుణంలో వ్యాధి నుండి జాగ్రత్తగా ఉండడానికి యువ నాయకుడు వంగ రాజశేఖర్ గౌడ్ వార్డు ప్రజలకు మాస్కులు స్పాన్సర్ చేశారు. సోమవారం కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు (చౌట బెట్ల) గ్రామ ప్రజలకు  యూవ నాయకుడు వంగ రాజశేఖర్ గౌడ్ సొంత ఖర్చులతో మాస్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ముఖ్య అతిథిగా కొల్లాపూర్ ఎసై కొంపల్లి మురళి గౌడ్ హాజరయ్యారు. యువకులు జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో ఎసై మురళీగౌడ్  ప్రజలకు మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎసై మురళి గౌడ్ కరోనా వైరస్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు కరోనా వైరస్ వ్యాధి నుండి అప్రమతంగా ఉండాలన్నారు.

ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి అత్యవసర సమయంలో బయటికి రావాలన్నారు. ఇంటికి ఒకరు మాత్రమే బయటికి వచ్చి త్వరాగా  పనులు ముగించుకొని  వెళ్లాలన్నారు. ఇరవై నిమిషాలకు ఒక్కసారి సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని అన్నారు.

ఈ నెల 14వరకు ఎవ్వరు బయటకు రాకూడదన్నారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించాలన్నారు. లాక్ డౌన్ పాటించి కరోనా మహమ్మారిని జయించాలన్నారు. బట్టతో కుటించి 500 మాస్కులను సొంత ఖర్చులతో అందించిన యువ నాయకుడు వంగ రాజశేఖర్ గౌడ్ ను ఎస్సై కొంపల్లి మురళి గౌడ్ అభినందించారు.

Related posts

ఫేక్ ప్రాపగాండ చేసే ఏ ఒక్కడినీ వదిలిపెట్టను

Bhavani

ప్రతి పేదవారికి ఇళ్ళ పట్టాలు

Murali Krishna

రాష్ట్రంలో ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండండి

Satyam NEWS

Leave a Comment