32.7 C
Hyderabad
March 29, 2024 10: 49 AM
Slider ముఖ్యంశాలు

పేద విద్యార్ధులకు విద్యను దూరం చేయవద్దు

#PoorStudents

ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీల్లో రిజర్వేషన్ లు,  ఫీజు రియంబర్స్ మెంట్ ఉండదని ప్రకటించటం పేదవర్గాలకు విద్య దూరం చేయటమే అని కే.వి.పి.యస్ జిల్లా ఉపాధ్యక్షులు జిట్ట నగేష్, ఆవేదన వ్యక్తం చేశారు.

యం.యస్. యప్, యం. యస్. యు ల ఆధ్వర్యంలో నిర్వహించే పాదయాత్ర ఆదివారం నాడు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మండల కేంద్రానికి చేరుకున్నది. ఈ సందర్భంగా కనకదుర్గ సెంటర్ లో జరిగిన సభకు నగేష్ హాజరై మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు త్యాగం చేసిన యువతీయువకుల బలిదానం నేటి పాలక వర్గ ప్రయోజనాలకు ఉపయోగంగా మారిందని  అన్నారు. కాంగ్రెస్ జిల్లా నాయకులు పోకల దేవదాసు మాట్లాడుతూ రిజర్వేషన్ లు, పీజు రియంబర్స్ మెంట్ లేని విశ్వ విద్యాలయాలు అక్కర్లేదు అని విమర్శించారు.

ఈ సందర్భంగా పాదయాత్ర బృందానికి నాయకత్వం వహించిన రుద్రవరం లింగస్వామి, నకిరేకంటి నాగరాజు తదితరులకు పూలమాలలు వేసి స్వాగతించారు.

కార్యక్రమంలో యం ఆర్ పీ యస్ జిల్లా నాయకులు పాల క్రిష్ణ, చేగూరి గణేష్, వివిధ ప్రజా సంఘాల నాయకులు కందాల రమేష్ రెడ్డి, బరాల నర్సింహ, జిట్ట లింగయ్య, వంగాల నవీన్, మహేష్, రాజేష్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

గోవా లో కరోనా ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత

Satyam NEWS

ఐక్యూ చిత్రం ఆడియో విడుదల

Satyam NEWS

టైగర్ మూవ్స్:శ్రీశైలం ఘాట్ రోడ్డులో పులి సంచారం

Satyam NEWS

Leave a Comment