39.2 C
Hyderabad
March 29, 2024 16: 16 PM
Slider నిజామాబాద్

సపోర్టు: శనగ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

bichkunda 272

బిచ్కుంద మండలంలోని పుల్కల్ పెద్దదేవాడ పెద్ద దడిగి గ్రామాల్లో  శనగ కొనుగోలు కేంద్రాలను ఎంపిపి అశోక్ పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కొనుగోలు కేంద్రాలు బిచ్కుంద మండల కేంద్రంలోని ఉండేవని కానీ కరోనా మహమ్మారి వ్యాపిస్తుందన్న భయంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయా గ్రామాలలోని శనగ  కొలుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ప్రభుత్వ మద్దతు ధర 4878 క్వింటాలుకు రూపాయలు కేటాయించిందని రైతులు తమకు ఇచ్చిన అనుమతుల విధంగా కొనుగోలు కేంద్రాలను సంప్రదించి తమ శెనగ విత్తనాలను అమ్ముకోవాలని అన్నారు. పుల్కల్ కొనుగోలు కేంద్రాల పరిధిలో సిర్సముందర్ వాజిద్నగర్ గుండె నమిలి గ్రామాల రైతులు, పెద్దదేవాడ కొనుగోలు కేంద్రం పరిధిలో చిన్నదేవాడ గ్రామ రైతులు, చిన్న పెద్ద దడిగి గ్రామ పరిధిలో చిన్న దడిగి గ్రామ రైతులు తమ శనగ పంటలను విక్రయించుకోవాలన్నారు.

పూర్తి పంటలు విక్రయించే వరకు కేంద్రాలు పని చేస్తాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపితో పాటు వైస్ పిపి రాజుపటేల్ మాజీ జడ్పీటిసి సాయిరాం మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు తెరాస మండల అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు సిద్దిరాములు, పుల్కల్ సొసైటీ చైర్మన్ ఇందిరా ప్రహ్లాద్ దేశాయి, వైస్ చైర్మన్ రామిరెడ్డి, సర్పంచ్ విజయలక్ష్మి భూమిషెటి, పెద్దదేవాడ సర్పంచ్ శివానంద్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు మల్లికార్జున్, పెద దేవాడ సర్పంచ్ ఆకుల సాయిలు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Related posts

సిపి ఐ వార్షికోత్సవాలను జయప్రదం చేయండి

Satyam NEWS

50 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సత్వర చర్యలు

Satyam NEWS

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

Satyam NEWS

Leave a Comment