28.2 C
Hyderabad
April 20, 2024 12: 51 PM
Slider నిజామాబాద్

లాక్ డౌన్ ఉన్నా రైతులకు ఇబ్బందులు లేవు

pocharam 221

కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్నందున దేశ వ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ తెలంగాణాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట కొనుగోళ్ళకు ఏర్పాటు చేశామని నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని కొత్తపల్లి, కోటగిరి, పోతాంగల్,ఎత్తోండ సొసైటీల పరిధిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను భాస్కర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..రాష్ట్రంలో సరిగ్గా పంటలు కోతకొచ్చిన సమయంలో లాక్ డౌన్ విధించినందున  రైతులు తాము పండించిన పంటలు ఎలా అమ్ముకోవాలని ఆందోళన చెందుతున్న వేళ,రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సీఎం కేసీఆర్ పంట కొనుగోళ్ళకు అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు.

పంట కొనుగోలుకు ప్రతి గ్రామంలో ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇప్పటికే చాలా మంది రైతులకు పంట అమ్మిన డబ్బులు ఆకౌంట్లో పడ్డాయని తెలిపారు. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నందున రైతులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, ప్రతి అరగంటకోసారి చేతులు మోచేతుల వరకు శుభ్రంగా కడుక్కోవాలని,తప్పకుండా సామాజిక దూరం పాటించాలని కోరారు. లాక్ డౌన్ వేళ అందరూ ఇళ్లలోనే ఉండాలని పోలీసులు, ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా బాన్సువాడ నియోజకవర్గంలో రేషన్ కార్డు లేని నిరుపేదలకు పోచారం ట్రస్ట్ ద్వారా ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం, వెయ్యి రూపాయల విలువచేసే నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కోటగిరి జడ్పీటీసీ సభ్యుడు శంకర్ పటేల్, ఏఎంసీ చైర్మన్ గంగాధర్,జడ్పీ కో ఆప్షన్ మెంబర్ సిరాజ్, మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాస్ సొసైటీ చైర్మన్లు డాక్టర్ సునీల్ కుమార్, శాంతీశ్వర్ పటేల్, కూచి సిద్ధు, అశోక్ పటేల్,ఏఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ విఠల్, రైతులు, నాయకులు పాల్గొన్నారు.

Related posts

డివైన్ వర్డ్: మహాభారత కావ్య పఠనం ముక్తి కి మార్గం

Satyam NEWS

మన దేశానికి దేవుడు ఇచ్చిన సేవకుడు

Satyam NEWS

యండమూరి “అతడు ఆమె ప్రియుడు” నుంచి కౌశల్ సింగిల్ టేక్ డైలాగ్ రిలీజ్!!

Satyam NEWS

Leave a Comment