33.2 C
Hyderabad
April 26, 2024 02: 46 AM
Slider గుంటూరు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి ఫ్ఫ్యాప్టో సమాయత్తం

#APsecretariat

ఇప్పటికే ప్రభుత్వంపై ఎపీ జేఏసీ అమరావతి, ఎపిజీ ఈ ఏ లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుండగా తాజాగాఫ్ఫ్యాప్టో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సమాయత్తం అవుతోంది. ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని ఫ్యాప్టో డిమాండ్ చేసింది. లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ తప్పదంటూ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసింది. దాదాపు ఎనిమిది డిమాండ్లను ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ప్రభుత్వం ముందు పెట్టింది.

ఈ సందర్భంగా ఫ్యాప్తో చైర్మన్ ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉపాధ్యాయుల పట్ల అనుసరిస్తున్న వైఖరిని నిరోధించాలన్నారు. పాఠశాల వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న జీవో ఎంఎస్ నం.117ను రద్దు చేయాలని, బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలని డిమాండ్ చేశారు. అలాగే పదోన్నతులను రెగ్యులర్ ప్రాతిపదికన ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని, పీఆర్సీ, ఇతర బకాయిలను వెంటనే విడుదల చేయాలని, చట్టబద్ధమైన 12వ పిఆర్సిని వెంటనే నియమించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు 11వ పీఆర్సీకి అనుగుణంగా పెంచాలి అంటూ ఎనిమిది డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు.

ఫ్యాప్టో కార్యాచరణ ఇదే..

2023 జూన్ 5 నుంచి 9 వరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రాతినిధ్యం

జూన్ 14 నుంచి 16 వరకు నియోజకవర్గాల స్థాయి సమావేశాలు, స్థానిక ఎమ్మెల్యేలకు ప్రాతినిధ్యాలు

జూన్ 18 నుంచి జూలై 9వ వరకు ఉమ్మడి జిల్లాల వారీ సదస్సులు

జూలై 11 సమస్యల పరిష్కారానికై ముఖ్యకార్యదర్శి కి నోటీసు

జూలై 26, 27, 28న మండల కేంద్రాలలో ధర్నాలు

ఆగష్టు 4న తాలూకా స్థాయిలో 12 గంటల ధర్నా

ఆగష్టు 1న జిల్లా స్థాయి ర్యాలీ, 24 గంటల ధర్నా

ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 1వ వరకు రాష్ట్రంలో మూడు ప్రాంతాల నుంచి రాష్ట్ర వ్యాప్త బైక్ జాతా.

Related posts

పైడిత‌ల్లి అమ్మ‌వారి పండుగ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన జేసీ కిషోర్‌

Satyam NEWS

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

Bhavani

డోంగ్లీ లో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం    

Satyam NEWS

Leave a Comment