32.2 C
Hyderabad
March 29, 2024 00: 13 AM
Slider సినిమా

ఫేక్ ఎలిమినేషన్ తో రివర్స్ ఓపీనియన్

bigboss nag

బిగ్ బాస్ హౌస్‌లో ఫేక్ ఎలిమినేషన్ పై ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఇలాంటి పనులు చేయడం వల్ల బిగ్ బాస్ క్రెడిబులిటీ పోతుందని కూడా విమర్శిస్తున్నారు. ఆట కోసం చేసినా హౌస్ లో ఉన్నవారితో సహా ప్రేక్షకులు కూడా ఫూల్ అయినట్లుగా భావిస్తున్నారని ఫీడ్ బ్యాక్ వచ్చిందని అంటున్నారు. డబుల్‌ ఎలిమినేషన్‌ అని చెప్పి శనివారం నాడు రాహుల్‌ ఎలిమినేట్‌ అయినట్టు ప్రకటించిన బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌ను షాక్‌కు గురి చేశాడు. అయితే ఇంతవరకు ఓకే అని అనుకుంటూ ఉంటే చూసే ప్రేక్షకుడికి మరో షాక్‌ ఇచ్చాడు. అంతా ఎమోషనల్‌ అవ్వడం చూసి ప్రేక్షకులు కూడా రాహుల్‌ ఎలిమినేషన్‌ను జీర్ణించుకోలేకపోతున్న సమయంలో ఇదంతా ఫేక్‌ ఎలిమినేషన్‌ అంటూ మరో షాక్‌ ఇచ్చాడు. దీంతో రాహుల్‌ కూడా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇక రాహుల్‌ను సీక్రెట్‌ రూమ్‌లోకి పంపించిన బిగ్‌బాస్‌ ఏ ఆట ఆడిస్తాడో చూడాలి. ఎలిమినేట్‌ కాలేదని, సీక్రెట్‌ రూమ్‌లోకి పంపించాడని శనివారం సాయంత్రం ప్రోమో రిలీజ్‌ చేసిన వెంటనే ట్రెండ్‌ అయింది. అయితే ఇందులో ఎంత నిజమున్నదో అప్పుడు తెలియక కొందరు అవన్నీ రూమర్స్‌గానే కొట్టిపారేశాడు. అయితే ప్రోమోలో అంతా తెలిసేట్టు కట్‌చేయడంతో అంత సస్పెన్స్‌గా అనిపించలేదు. ప్రోమోలో అలా చేశాడంటే.. కచ్చితంగా బిగ్‌బాస్‌ మైండ్‌లో ఏదో మర్మం ఉందని ఊహించిన నెటిజన్లు.. ఆయన ఆలోచనలను ఇట్టే పసిగట్టారు. రాహుల్‌ సీక్రెట్‌ రూమ్‌లో ఉన్నాడని ముందే చెప్పేశారు. రాహుల్‌ది ఫేక్‌ ఎలిమినేషన్‌ అని తెలిస్తే పునర్నవే ఎక్కువగా సంతోషిస్తుందన్నది అందరికీ తెలిసిందే. రాహుల్‌ ఎలిమినేట్‌ అయ్యాడని నాగ్‌ చెప్పినప్పటి నుంచి పున్ను తెగ బాధపడుతూ కనిపించింది. రాహుల్‌ ఎలిమినేట్‌ కాడని తనకు గట్టి నమ్మకం అని చెప్పుకొచ్చింది.. కానీ ఎలిమినేట్‌ అయ్యాడంటూ బాధపడింది. అయితే తన నమ్మకమే నిజమైందని పునర్నవికి తెలిస్తే.. ఎగిరి గంతేస్తుందేమో చూడాలి. ఇదే సమయంలో మిగతా ఇంటి సభ్యులకు ఇది ఫేక్‌ ఎలిమినేషన్‌ అని తెలిస్తే.. రాహుల్‌మళ్లీ హౌస్‌లోకి వస్తే.. ఎలా ఫీల్‌ అవుతారో చూడాలి.

Related posts

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులకు అండగా సత్యం న్యూస్

Satyam NEWS

బలమైన దేశం కోసమే పని చేస్తున్న బీజేపీ

Satyam NEWS

అప్పటి అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?

Bhavani

Leave a Comment