37.2 C
Hyderabad
April 19, 2024 12: 50 PM
Slider కడప

సోషల్ మీడియా లో అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు

#kadapapolice

సోషల్ మీడియా లో అవాస్తవాలు ప్రచారం చేస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కడప జిల్లా ఎస్.పి కె.కె.ఎన్ అన్బురాజన్ హెచ్చరించారు. ఈ  మేరకు గురువారం జిల్లా ఎస్పీ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చే విధంగా సోషల్ మీడియా వేదికగా మతపరమైన, సున్నిత అంశాల్లో అవాస్తవాలు ప్రచారం చేస్తూ శాంతి భద్రత లకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నట్టు పోలీస్ శాఖ దృష్టికి వచ్చిందని, అలాంటి పోస్టు లు పెట్టే వారిపై సైబర్ సెల్ సోషల్ మీడియా విభాగం నిఘా ఉంచామని తెలిపారు.

సదరు చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అవాస్తవ ప్రచారాన్ని ప్రజలు ఎవ్వరూ నమ్మవద్దని ఎస్.పి సూచించారు.  ఫేక్ న్యూస్ వ్యాప్తి లేదా ఫార్వర్డ్ చేసే వారిపై నిఘా ఉంచామని, నిజానిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియా లో పోస్ట్ చేసే వారిపై, షేర్ చేసే వారిపై, సంబంధిత గ్రూప్ అడ్మిన్ల పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్.పి హెచ్చరించారు.

Related posts

కొల్లాపూర్ లో యాదవులపై నయీమ్ గ్యాంగ్ వరుస దాడులు

Satyam NEWS

రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత కుమార్తె మృతి

Satyam NEWS

నూతన జాతీయ విద్యా విధానం రద్దుకై పోరాటాలు

Bhavani

Leave a Comment