శ్రీకాకుళం జిల్లాలో దొంగనోట్ల కల్లోలం చెలరేగింది. జిల్లాలోని మెలియాపుట్టి మండలం పట్టుపురం వద్ద దొంగనోట్లతో ఆరుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. నిందితుల వద్ద నుండి మొత్తం 57 లక్షల రూపాయల దొంగనోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా వారి నుంచి దొంగ నోట్ల ప్రింటింగ్ మిషన్ ను కరూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగనోట్ల ముఠా వెనుక ఎవరు ఉన్నారు అనే దానిపై ఆసక్తి రేగుతున్నది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
previous post