30.2 C
Hyderabad
September 14, 2024 17: 14 PM
Slider సినిమా

లక్కీ మీడియా బ్యానర్ ఫలక్ నుమా హీరో

falaknuma das hero

టాటా బిర్లా మధ్యలో లైలా, మేం వయసుకు వచ్చాం, సినిమా చూపిస్తామామా లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన లక్కీ మీడియా బ్యానర్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ హుషారు తో మరో హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో క్రేజీ లవ్ స్టోరీ నిలక్కీమీడియా నిర్మించబోతోంది. ఫలక్ నుమా దాస్ చిత్రంతో తో సక్సెస్ ను సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్ తో కలిసి పాగల్ పేరుతో కొత్త చిత్రం నిర్మించనున్నారు. ఈ మూవీ తో నరేష్ రెడ్డి కుప్పిలి అనే యంగ్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. క్రేజీ లవ్ స్టొరీ గా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ ద్వితీయార్థం నుండి మొదలుకానుంది. ఈ సందర్బంగా నిర్మాత బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ ఫలక్ నమా దాస్ లాంటి సూపర్ హిట్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన హీరో విశ్వక్ సేన్ తో మా లక్కీ మీడియా బ్యానర్ నెక్ట్ ప్రాజెక్ట్ చేయడం హ్యాపీ గా ఉంది. మా గత చిత్రం హుషారు సక్సెస్ మాకు మరిన్ని మంచి చిత్రాలు చేయడానికి, కొత్త వాళ్ళను పరిచయం చేయడానికి మంచి ఉత్సాహన్నిచ్చింది. ఈ మూవీ తో మా బ్యానర్ ద్వారా నరేష్ రెడ్డి కుప్పిలి అనే మరో యంగ్ డైరెక్టర్ పరిచయం చేస్తున్నాం. అతను చెప్పిన ఇంట్రెస్టింగ్ పాయింట్ కు అందరం బాగా కనెక్ట్ అయ్యాం. ఈ మూవీ బెస్ట్ క్రేజీ లవ్ స్టొరీ అవుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేద అని ఆయన తెలిపారు.

Related posts

మాల మహానాడు హుజూర్ నగర్ నియోజకవర్గ ఎన్నిక ఏకగ్రీవం

Satyam NEWS

హత్యాయత్నం వివరాలు వెల్లడించిన పులివర్తి నాని

Satyam NEWS

శ్రీ గుమ్మనాధేశ్వర ప్రాచీన శివాలయంలో ప్రత్యేక పూజలు

Bhavani

Leave a Comment