30.7 C
Hyderabad
April 24, 2024 01: 19 AM
Slider తూర్పుగోదావరి

ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం లంచం

family certificate

ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఎంత ఖర్చవుతుంది? ఎవరైనా ఫర్లేదు పది వేల రూపాయలు ఇస్తే చాలు. అదేంటి నిబంధనలు లేవా అని అడగవద్దు. ఎందుకంటే తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం ఇంఛార్జి రెవెన్యూ ఇన్స్పెక్టర్ సిహెచ్ కుమారి దేవి ఇలా ఫ్వామిలీ సర్టిఫికెట్ ఇస్తూ దొరికిపోయారు.

బీమనపల్లి గ్రామానికి చెందిన జె. మనోహరం ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికేట్ కోసం కార్యాలయానికి వెళ్లగా ఆమె లంచం అడిగారు. దాంతో రాజమండ్రి ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. లంచం డబ్బులు, సంబంధిత రికార్డులు స్వాధీన పరుచుకున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని రేపు రాజమండ్రి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరచనున్నారు.

Related posts

తుది శ్వాస విడిచిన మహాభారత్ భీముడు

Satyam NEWS

అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలి

Satyam NEWS

కరోనా వ్యాధిగ్రస్తులకు బాలయ్య ఫ్యాన్స్ అన్నదానం

Satyam NEWS

Leave a Comment