38.2 C
Hyderabad
April 25, 2024 13: 39 PM
Slider శ్రీకాకుళం

రీ అపోర్షన్ మార్గదర్శకాలతో విద్యా వ్యవస్థ నిర్వీర్యం

#FAPTOSrikakulam

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పాఠశాలల హేతుబద్ధీకరణ బదిలీ ఉత్తర్వులు సమీప భవిష్యత్తులో ప్రాథమిక విద్యారంగాన్ని సమూలంగా నాశనం చేసే విధంగా ఉన్నాయని ఫ్యాప్టో శ్రీకాకుళం జిల్లా కమిటీ చైర్మన్ పేడాడ ప్రభాకరరావు అన్నారు.

పాఠశాల విద్యాశాఖ లో పనిచేస్తున్న ఉన్నతాధికారుల వైఖరి ఆక్షేపణీయంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాల మౌలిక వసతులు కల్పన లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ, పాఠశాల విద్య విధానంలో ముఖ్య భూమిక పోషించాల్సిన ఉపాధ్యాయులను రీఎపోర్షన్మెంట్ పేరుతో ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 60 వరకు ఇద్దరే ఉపాధ్యాయులను నియమించడం వెనుక ప్రమాదకరమైన వ్యూహం దాగి ఉందని ఆయన అన్నారు.

కొనసాగుతున్న నిరాహార దీక్షలు

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న నిరవధిక నిరాహార దీక్షలు ఐదవ రోజు కు చేరుకున్నాయి. ఉపాధ్యాయులు ఉద్యమాలవైపు మళ్లకపోతే విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తుల వైపు మళ్ళించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. ప్రమాదం పసి కట్టకపోతే సమీప భవిష్యత్తులో అనగనగా మన ఊరి బడి కథగా మిగిలిపోయే ప్రమాదం ఉందని, ఉపాధ్యాయులు ఉద్యమాలు లోనికి రావాలని సూచన చేశారు.

ఏపీటీఎఫ్ 1938 సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి టెంక చలపతిరావు మాట్లాడుతూ విద్యా శాఖ ఉన్నతాధికారి డిమాండ్లపై చర్చలకు ఆహ్వానించారని, డిమాండ్లు పరిష్కారం పట్ల విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఫ్యాప్టో మలిదశ ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.

నూతన విద్యా విధానం గొడ్డలిపెట్టు

యు టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గిరిధర్ మాట్లాడుతూ  జాతీయ నూతన విద్యా విధానం విద్యారంగ మనుగడకే  గొడ్డలిపెట్టుగా ఉందని అంతటి ప్రమాదకరమైన బిల్లును అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్సాహం చూపడం విచారకరమని అన్నారు.

ఇది బడుగు బలహీన దళిత ఆదివాసీ మైనారిటీ వర్గాలకు విద్యను అందని ద్రాక్షగా మార్చేస్తుందని తదనుగుణంగా ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ విద్యారంగాన్ని టోకున అమ్మ చూపే విధానాన్ని వ్యతిరేకించడానికి భావసారూప్యత గల సంఘాలను కలుపుకొని మరో జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన తరుణం ఆసన్నమైందని తెలిపారు.

స్కూళ్ల ముస్తాబుతో సమస్యలు తీరవు

ఎస్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వి రమణ మూర్తి మాట్లాడుతూ పాఠశాలలను అంగరంగ వైభవంగా ముస్తాబు చేసినంత మాత్రాన లక్ష్యం నెరవేరదని విద్యుత్ దీపాల కాంతులు గ్రామీణ విద్యార్థుల జీవితాలలో కాంతులు నింపవని ప్రభుత్వం గుర్తెరగాలని అన్నారు.

ఏపిటిఎఫ్ 257 జిల్లా శాఖ అధ్యక్షులు మజ్జి మదన్ మోహన్ మాట్లాడుతూ ఉన్నతాధికారులు ఒంటెత్తు పోకడలు విడనాడాలని విడుదల చేసిన ఉత్తర్వుల్లో ని మార్గదర్శకాలు సవరించాలని ఫ్యాప్టో ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.

పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఫ్యాప్టో ప్రతిపాదనల ప్రాప్తికి మంజూరు చేయాలని ఏడాదికి ఒక పాయింట్ చొప్పున సర్వీస్ పాయింట్లు ఇవ్వాలని, 2019 లో చేపట్టిన పదోన్నతులు అప్గ్రేడెడ్ పోస్టులను, 2018 డీఎస్సీ స్థానాలను వేకెన్సీ లుగా చూపించాలని డిమాండ్ చేశారు.

దీక్ష శిబిరంలో ఫ్యాప్టో నాయకులు గోవిందరాజులు, ప్రధానోపాధ్యాయ సంఘ నాయకులు నీరజ, పి ఈ టి ,పి డి నాయకులు బెనర్జీ, వెంకటరమణ ,సిహెచ్ రామారావు, చింతాడ దిలీప్ కుమార్ ,గురుగుబెల్లి రమణ, వి నవీన్ కుమార్ ,చావలి శ్రీనివాస్, పి సూరిబాబు, సూర్యారావు, ఎండ ఉమాశంకర్ తదితరులు మాట్లాడారు.

ఈరోజు దీక్షలో ఎస్టియు నాయకులు లు రామారావు ,రమణ సూర్యారావు ,తమ్మి నాయుడు,సంతోష్ ,ఎన్ వి రమణ ,యు టి ఎఫ్ నాయకులు పురుషోత్తం, శ్రీను, సంతోష్ ,క్రాంతి ,ఏపిటిఎఫ్ నాయకులు కామేశ్వరరావు

ప్రభాకర్ రావు ,సుమలత, ప్రధానోపాధ్యాయులు సంఘం నుండి అమరవాణి,జయప్రద రమణమ్మ, పి డి సంఘ నాయకులు బిటి వెంకట్రావు, ఈశ్వర్ ,రమేష్ ,రమణ పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు  పాల్గొన్నారు.

Related posts

6న జర్నలిస్టుల సమస్యలపై సీపీఎం ధర్నా

Murali Krishna

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాలనీలలో పాదయాత్ర

Satyam NEWS

ఇంటర్ నెట్ షట్ డౌన్ లో ప్రపంచంలోనే మనమే నెంబర్ వన్

Satyam NEWS

Leave a Comment