39.2 C
Hyderabad
April 18, 2024 15: 58 PM
Slider విజయనగరం

విజయనగరం కలెక్టర్ గా సూర్యకుమారి చెరగని ముద్ర…!

#vijayanagaram

కొత్త కలెక్టర్ నాగలక్ష్మి కి ఆత్మీయ స్వాగతం…!

విజయనగరం జిల్లాగా  కలెక్టర్ ఏ.సూర్యకుమారి తనదైన పరిపాలనా శైలితో జిల్లాపై చెరగని ముద్ర వేశారని పలువురు కొనియాడారు. పంచాయితీ రాజ్ కమిషనర్ గా బదిలీపై వెళ్తున్న కలెక్టర్ సూర్యకుమారికి, జిల్లా అధికారులు, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ స్థానికంగా సుజాత ఫంక్షన్  హాలులో ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలికారు. జిల్లాకు కొత్త కలెక్టర్ గా నియమితులైన ఎస్.నాగలక్ష్మి కి ఇదే కార్యక్రమంలో ఆత్మీయ స్వాగతం పలికారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ, కలెక్టర్  సూర్యకుమారి లో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయని అన్నారు.

అందరినీ కలుపుకొని సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి చేశారనీ అన్నారు. మంచితనం తో పాటు, దానిని అందరికీ పంచిపెట్టే మంచి గుణం కలెక్టర్ సూర్యకుమారిలో ఉందన్నారు. సున్నిత హృదయులు అయినప్పటికీ, పాలనలో అవసరమైనప్పుడు కటిన నిర్ణయాలు తీసుకొనేవారని చెప్పారు.  కలెక్టర్ పోస్ట్ రావడం చాలా అరుదైన అవకాశమని, దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ మాట్లాడుతూ, తన కెరీర్ మొదట్లోనే కలెక్టర్ సూర్యకుమారి వద్ద పని చేయడం గొప్ప అవకాశమని, తనకు చక్కని మార్గ నిర్దేశం చేశారని చెప్పారు. ఒక కుటుంబంలా కలిసికట్టుగా పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేశామని, గృహ నిర్మాణంలో రాష్ట్రంలోనే మూడో స్థానాన్ని సాధించామని చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసి, వాటికి అనుగుణంగా కలెక్టర్ నిర్ణయాలు తీసుకొనేవారని పేర్కొన్నారు.

సఖి కార్యక్రమం ద్వారా మహిళల్లో చైతన్యానికి కృషి చేసి, ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.ఈ సందర్భంగా పలువురు జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు, అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, జిల్లాకు కలెక్టర్ చేసిన సేవలను, తమ అనుభవాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ దీపికా పాటిల్, డియార్వో ఎం.గణపతిరావు పాల్గొని సన్మానించారు. కార్యక్రమానికి ఆర్.డబ్ల్యు.ఎస్. ఎస్ఈ బి.ఉమాశంకర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

Related posts

సీఎం ప్రకటన సరైంది కాదు: ఐజేయూ

Bhavani

గడ్డిపోతారం పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం

Bhavani

హైదరాబాద్ లో జోరుగా సాగుతున్న డ్రగ్స్ దందా

Satyam NEWS

Leave a Comment