38.2 C
Hyderabad
April 25, 2024 14: 57 PM
Slider కడప

నకిలీ అరటి మొక్కలతో రైతుకు నష్టం….

#kadapa farmer

నకిలీ అరటి మొక్కలతో రైతు మరోసారి దగా పడ్డాడు.ఇదేమి న్యాయమని ప్రశిస్తే దిక్కున చోటు చెప్పు కోమని మొక్కలు విక్రయించిన నర్సరీ యజమాని సమాధానం చెప్పడంతో రైతు ఆవేదన చెందుతున్నారు.

కడప జిల్లా ఉడుమవారి పల్లె శ్రీధర్ రెడ్డి అనే రైతు టీషు కల్చర్ జి 9 వెరైటీ అరటి పిలకలను రైల్వే కోడూరు కు చెందిన వ్యాపారి హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ఎస్.వి.ఆగ్రో టిస్యూ కల్చర్ జీనిన్ వెరైటీ నుంచి కొనుగోలు చేసాడు.

15 రోజుల క్రితం 5 వేల500 మొక్కలకి ఒక్కో మొక్క 11 రూపాయల చొప్పున 60 వేల 500 ఆన్లైన్ ద్వారా డబ్బు కట్టి ఆర్డర్ చేశారు.వాటి డెలివరీ జరిగింది.మొక్కలు ఇచ్చిన 5 రోజుల నుంచి చాలా మొక్కలు చనిపోగా, నాటిన మొక్కల్లో దాదాపు 400 మొక్కలు చనిపోయాయి.

మొత్తం 5 వేల 500 మొక్కలకు గాను, 2 వేల 200 మొక్కలకు పైగా చని పోయాయి.మొక్కలు సరఫరా చేసిన కడప జిల్లా రైల్వే కోడూరు మండలం ఆసురు పల్లెకు చెందిన దేశీ మధుసూధన్ రెడ్డి ని దీనిపై రైతు శ్రీధర్ రెడ్డి ఫోన్ ద్వారా సమస్యను వివరించారు.మీరు డబ్బులు ఇచ్చారు, నేను మొక్కలు ఇచ్చాను తరువాత నాకే సంబందం లేదని బుకాయించి నట్టు రైతు ఆవేదన వ్యక్తంచేశారు.

ఫోన్ చేస్తే అసభ్యంగా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. తాను లక్ష రూపాయలకు పొలం పన్నుకు తీసుకున్నానని, 5 ఎకరాలకు డ్రిప్ సబ్సిడీ లేకుండా దాదాపు 6 లక్షల ఖర్చు అయ్యిందని. ఇప్పుడు నకిలీ మొక్కలతో మోసపోయానని ఆవేదన వ్యక్తంచేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నకిలీ విత్తనాలు,నకిలీ మొక్కలు సరఫరా చేసే వారి పై చర్యలు తీసుకుంటామని సృష్టం చేశారని,తనకు మొక్కలు వద్దు,నష్ట పరిహారం వద్దని ఇలాంటి అన్యాయం మరో రైతుకు జరగకుండా ఇలాంటి వారిపై రాష్ట్ర ముఖ్యమంత్రి తగు చర్యలు తీసుకోవాలని బాధిత రైతు శ్రీధర్ రెడ్డి కోరారు.

Related posts

కొత్త వేరియంట్లు తప్పవు

Sub Editor 2

మార్పులు, చేర్పులకు 1820 దరఖాస్తులు

Bhavani

కంప్లయింట్: తరుగు పేరుతో రైతును కొల్లగొడుతున్నారు

Satyam NEWS

Leave a Comment