మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన గతంలో అసోం నుంచి రాజ్యసభకు ఎన్నిక కాగా, ఇప్పుడు మరోసారి రాజ్యసభ సభ్యుడిగా రాజస్థాన్ నుంచి ఎన్నికయ్యారు. అస్సాం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీకాలం ముగియడంతో.. ఒక సీటు తమకు తమిళనాడు నుంచి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డీఎంకేను కోరింది. అయితే కాంగ్రెస్ రిక్వెస్ట్‌కు డీఎంకే నో చెప్పింది. దీంతో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ నుంచి మన్మోహన్ సింగ్ రాజ్య సభకు నామినేషన్ వేశారు. మరో నామినేషన్ ఏదీ రాకపోవడంతో మన్మోహన్ సింగ్ ఎన్నిక ఏకగ్రీవం అయింది.
previous post
next post