29.2 C
Hyderabad
September 10, 2024 17: 23 PM
Slider ఆదిలాబాద్

వర్షాలతో నష్టపోయిన రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి

sanke ravi

సి పిఎం పార్టీ మంచిర్యాల జిల్లా సమావేశం బెల్లంపల్లి మండలంలోని సిపిఎం ఆఫీస్ లో గుమాస ప్రకాష్ సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడి అధ్యక్షతన నిర్వహించి అనంతరం జిల్లా కార్యదర్శి సంకె రవి మరియు జిల్లా కమిటీ సభ్యులు గుమాస అశోక్ మాట్లాడుతూ జిల్లాలో వర్షాల కారణంగా చెన్నూరు నియోజకవర్గంలో కాలేశ్వరం బ్యాక్ వాటర్ కారణంగా వందల ఎకరాల పంట పొలాలు,పత్తి చేనులు నీట మునిగిపోయి రైతులు అనేకంగా నష్టపోయారు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందించాలి. అదేవిధంగా జిల్లాలో పలు గ్రామాలు మరియు వార్డులు నీటిలో మునిగిన పరిస్థితి కూడా ఉంది కావున వారికి కూడా ప్రభుత్వం న్యాయం చేయాలి అదేవిధంగా రోడ్లు కూడా నీటి వరదకు కోట్టుక పోవడం జరిగింది రోడ్లు పోయిన చోట వెంటనే రోడ్ల నిర్మాణం చేయాలి.

కేంద్రంలో,రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ,కాంగ్రెస్ పార్టీల నాయకులు పర్యటనలకే పరిమితం కాకుండ మీ మీ ప్రభుత్వాల ద్వారా తక్షణమే బాధితులను అదుకునే విధంగా తగిన కృషి చెయ్యాలి.ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి నష్టపోయిన రైతులకు మరియు ప్రజలకు నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఈ సమావేశంలో CPM జిల్లా నాయకులు నాగరాజు గోపాల్,దూలం శ్రీనివాస్ జిల్లా కమిటీ సభ్యులు,అబ్బోజు రమణ,చల్లూరి దేవదాస్,అరిగెల మహేష్,డోర్కె మోహన్,దుర్గంసజీవన్,శ్రీకాంత్ పాల్గొన్నారు.

Related posts

సిఎం కేసీఆర్ ఆడబిడ్డలకు దేవుడిలాంటి వాడు

Satyam NEWS

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్క‌లు నాటిన‌ హీరోయిన్

Sub Editor

నిధులను సక్రమంగా వినియోగించుకోవాలి

Satyam NEWS

Leave a Comment