30.7 C
Hyderabad
April 19, 2024 10: 52 AM
Slider వరంగల్

వరి పొలంలో కలుపు తీసిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

#SubregisrTaslima

రైతన్న చెమట చుక్కలు రాల్చడం వలనే మనం అందరం కడుపు నిండా అన్నం తింటున్నాం అని ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు.

ఆమె గత కొంత కాలంగా శెలవు దినాల్లో రైతుగా పని చేస్తున్నారు. నేడు పంట చేనులలో రైతు కూలీల తో కలిసి రోజంతా వరి పొలంలో కలుపు తీశారు.  ఆదివారం ములుగు జిల్లా జాకారం గ్రామంలో మూధం కుమార్,అంబిక దంపతుల వరి పొలంలో కూలీలతో కలుపు (గడ్డి) తీశారు.

రోజంతా పని చేసినందుకు గాను 250 కూలీ డబ్బులు ఇచ్చారు. ఆ కూలీ డబ్బుల తో పాటు మరో 500 కలిపి ఒక పేద యువతికి అందించారు. అనంతరం తస్లీమా మాట్లాడుతూ అన్నం పెట్టే రైతన్నను ప్రతి ఒక్కరూ గౌరవించాలి అని అన్నారు. 

కష్టాన్ని నమ్ముకొని కాలన్ని వెళ్లదీస్తూ అందరి ఆకలిని అంతం చేసే రైతన్న సమస్త మానవాళికి పెద్ద దిక్కు అని అన్నారు. రైతన్న గొప్ప మనసున్న మారాజు అని తన చెమట చుక్కలను ధారపొస్తు మనకు అన్నం పెడుతున్నాడు అని అన్నారు.

ఈ సమాజానికి పెద్ద దిక్కు అని రైతన్న గొప్పతనాన్ని కీర్తించారు. వ్యవసాయం చేయడానికి యువతి, యువకులు నామోషీగా అనుకోవద్దని, రైతన్నే లేకపోతే మానవ జాతి మొత్తం కనుమరుగైపోతుందని తెలిపారు.

ప్రతి ఒక్కరూ వ్యవసాయ రైతులకు చేదోడు వాదోడుగా ఉండాలని ఆమె  కోరారు.

కునూరు మహేందర్, సత్యం న్యూస్, ములుగు

Related posts

స్కిల్ కేసులో బదులే రాని ప్రశ్నలు ఎన్నో

Satyam NEWS

మడికి బ్రాందీ షాపులో రూ.2 లక్షలు నగదు చోరీ

Bhavani

టీడీపీ హయాంలో విజయనగరం ఆర్డీఓ అడ్డగోలుగా అమ్మేయలేదా

Satyam NEWS

Leave a Comment