27.7 C
Hyderabad
March 29, 2024 03: 09 AM
Slider నల్గొండ

నకిరేకల్ లో యూరియా కొరతను నివారించాలి

#Urea Scarcity

“వ్యవసాయపు సీజన్ ప్రారంభమై నెలలు గడుస్తున్నా నేటికీ ప్రభుత్వం రైతాంగానికి తగినంత యూరియా పంపిణీ చేయడం లేదని, యూరియా కొఱతతో నిరంతరం రైతాంగం పిఎస్సిఎస్ కు తిరిగి వెళుతున్నారని, జిల్లా మార్క్ఫెడ్ డిఎం వెంటనే తగినంత యూరియాను నకిరేకల్ఖు పంపించాలని” ప్రజా పోరాట సమితి (పి.ఆర్.పి.ఎస్.) రాష్ట్ర అధ్యక్షులు నూనె వెంకట్ స్వామి డిమాండ్ చేశారు.

ఈరోజు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం తాటికల్ పీఎసిఎస్ సిఈవో జగన్మోహన్ రెడ్డికి రైతాంగంతో కలిసి మెమోరాండం అందజేశారు. చరవాణిలో డి.ఎం.సునీతతో మాట్లాడారు. “ప్రారంభంలోనే ఎక్కడ ఏ మేరకు యూరియా అవసరమవుతుందో ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం ఆయా పిఎసిఎస్లకు పంపిణీ చేయాలని కొరతను సృష్టించవద్దని వెనువెంటనే రైతాంగాన్ని యూరియానిచ్చి ఆదుకోవాలని” ఆయన ప్రభుత్వ అధికారులకు కోరారు.

మెమోరాండం అందజేసిన వారిలో పీఆర్పీఎస్ జిల్లా నాయకులు కె. సత్యనారాయణ చారి, ఇదిగాని కుమార్ యాదవ్, ఎన్నమల్ల పృథ్వీరాజ్, పాల వెంకట్, మారగోని శ్రీనివాస్ గౌడ్, వడ్డెగాని మహేష్ గౌడ్, మాచర్ల భాస్కర్ తదితరులు ఉన్నారు.

Related posts

అణగదొక్కాలని చూస్తే ఇంకా పైకి లేస్తాం

Satyam NEWS

మాదిగ అమర వీరులకు ఘనంగా నివాళి

Satyam NEWS

మేడే జయప్రదం చేసేందుకు కార్మికులు సిద్ధం కావాలి

Satyam NEWS

Leave a Comment