40.2 C
Hyderabad
April 19, 2024 16: 19 PM
Slider విజయనగరం

‘రైతుకు ధీమా కలిగించే బీమా పధకం’…!

#VijayanagaramCollector

ఏపీ సీఎం జగన్ రైతులకు ధీమా కలిగించే విధంగా బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు వెలగపూడి సచివాలయం నుంచీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వై.ఎస్.ఆర్ ఉచిత పంటల బీమా పథకం  క్రింద విజయనగరం జిల్లాలో 3346 మంది రైతులకు 2.96 కోట్ల పరిహారాన్ని  రైతుల ఖాతాల్లో  సీఎం జగన్  జమ చేసారు.  

వెలగపూడి నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్  1252 కోట్ల 9.48 లక్షల మందికి ఒక్క బటన్ నొక్కి  రైతుల ఖాతాల్లో జమ చేసారు.  రాష్ట్ర వ్యాప్తంగా 22  పంటలను  బీమా క్రింద నోటిఫై చేయగా విజయనగరం నుండి  వరి, వేరుసెనగ, చెరకు, అరటి  పంటలకు బీమా వర్తింప చేసారు.  

రైతు ఒక్క రూపాయి చెల్లిస్తే, మిగిలిన ప్రీమియం ను ప్రభుత్వమే చెల్లించి  ప్రతి అడుగులో రైతుకు తోడుగా నిలుస్తున్నామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు.  విజయనగరం నుండి పాల్గొన్న ఎమ్మెల్సీ పెనుమత్స  సురేష్ బాబు,  జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ ,

సంయుక్త కలెక్టర్ డా. జే.సీ.కిషోర్ కుమార్  తదితరులు రైతులకు బీమా పరిహారపు  చెక్కును అందజేశారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు  ఆశా దేవి,  డీడీ నందు,  ఉద్యాన శాఖ డీడీ శ్రీనివాస రావు , రైతులు పాల్గొన్నారు.

Related posts

హెల్మెట్ పెట్టుకోండి..ప్రాణాలు కాపాడుకోండి..అంటున్న ట్రాఫిక్ పోలీసులు

Satyam NEWS

టీడీపీ కార్యకర్తలను వేధించడమే ల‌క్ష్యంగా వైసీపీ నేత‌లు

Satyam NEWS

ప్రతిపక్షాలను అవమానిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment