39.2 C
Hyderabad
April 25, 2024 15: 29 PM
Slider నల్గొండ

వరిపంట చేతికి వచ్చే దశలో రైతాంగం మరింత జాగ్రత్తగా ఉండాలి

#Saidireddy

రైతులు పంట దిగుబడి పెంచేందుకు సంబంధిత అధికారుల సూచనలు పాంటించాలని శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో పంట పొలాలను పరిశీలించిన సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ అకాలవర్షం కారణంగా బ్యాక్టీరియా , వైరస్ వ్యాప్తి చెంది వరి పంటలో ఎండాకు తెగులు, మెడ విరుపు, పాముపొడ వంటి సమస్యలకు నివారణ చర్యలను అధికారుల సూచనల మేరకు రైతులు తీసుకోవాలని కోరారు.

ప్రస్తుతం వరి చేను ఈనే దశలో ఉన్నందున మరింత జాగ్రత్త గా రైతులు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కడెం వెంకటరెడ్డి, ఎం‌పి‌పి పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ త్రిపురం సీతారాంరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జోగు అరవింద రెడ్డి , ప్రధాన కార్యదర్శి  మన్సూర్ అలీ, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆరు గంటల ఆందోళన: రేపు కామారెడ్డి బంద్ కు రైతుల పిలుపు

Satyam NEWS

దోమల నివారణకు ప్రతి ఆదివారం 10 నిమిషాలు

Satyam NEWS

సింగర్ సునీతకు కరోనా ఏ విధంగా వచ్చిందంటే..

Satyam NEWS

Leave a Comment