32.2 C
Hyderabad
March 29, 2024 00: 58 AM
Slider మెదక్

డిమాండ్ ఉన్న పంటలు వేస్తేనే రైతుకు లాభం

#Finance Minister

మార్కెట్లో అమ్ముడుపోయే పంటలనే సాగు చేసే అలవాటు రైతాంగంలో వచ్చేలా రైతులను చైతన్యం చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ లో సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు పద్మాకర్, ముజంమీల్ ఖాన్, డీఏఓ శ్రవణ్, హార్టికల్చర్ డీడీ రామలక్ష్మి, డివిజన్, మండలాల వ్యవసాయ శాఖ అధికారులు, అరబిందో, బ్రేయర్ కంపనీ ప్రతినిధులతో పండ్లు, కూరగాయలు, స్వీట్ కార్న్ పంటల సాగుపై మంత్రి సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లా వ్యవసాయ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. జిల్లాలో 1200 ఎకరాలలో స్వీట్ కార్న్ పంటలు సాగు చేయాలనే ఆలోచన పై ముందస్తుగా ఒప్పందం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు, కిలోకు రూ.8 రూపాయల చొప్పున్న కొనుగోళ్లు చేయనున్నట్లు అధికారులు, కంపనీ ప్రతినిధులు సమీక్షలో మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

ఈ విషయమై జిల్లాలో 1200 ఎకరాల మేర స్వీట్ కార్న్ సాగు చేస్తున్న దృష్ట్యా సమీప గ్రామాల్లో 200 ఎకరాల్లో స్వీట్ కార్న్ సాగుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. దాదాపు 70 రోజుల్లో స్వీట్  కార్న్ చేతికొస్తుందని మంత్రి వివరించారు.

సీడ్ సాగు పెంచితే.. ప్రతి రైతుకు ఆదాయం

జిల్లాలో సీడ్ సాగు పెంచితే.. ప్రతీ రైతుకు ఆదాయం పెరుగుతుందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. గతేడాది సీడ్ సాగుకు ఈ యేటా సీడ్ సాగుపై వ్యత్యాసం చూసి జిల్లాలోని ప్రతీ మండలంలో విత్తన సాగు పెంచేలా కృషి చేయాలని మండల వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలో విత్తన సాగు పెరిగేలా జిల్లాలోని సీడ్ కంపనీ ప్రతినిధులతో సమీక్షించి సహకారం పొందాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డికి మంత్రి సూచించారు.

ప్రాధాన్య పంటల సాగుపై అధికారులతో చర్చ

ప్రాధాన్య పంటల సాగులో భాగంగా జిల్లాలో 95 శాతం గ్రామాలు తీర్మాణాలు చేసి ముందుకొచ్చాయని, గ్రామ, మండల ప్రణాళిక ఆధారంగా 4 లక్షల 99 వేల ఎకరాలలో వానా కాలంలో అన్నీ రకాల పంటలు సాగు చేస్తున్నట్లు జిల్లా ప్రణాళిక సిద్ధం అయ్యిందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. గ్రామం, పంట వారీగా వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రణాళికలపై మండలాలు, గ్రామాల వారీగా అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతీ మండలంలో వందలాది మంది రైతులలో వెయ్యి 500 ఎకరాలలో మార్పు తెచ్చేలా కృషి చేయాల్సిన బాధ్యత మండల వ్యవసాయ శాఖ అధికారిపై ఉన్నదని ఏఓలకు మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులకు, ఏఓలకు ఉన్న అవగాహన, అనుభవం, వ్యవస్థలతో కలిసి ఉన్నప్పటికీ.. రైతుల్లో మార్పు తేవడంతో వెనుకంజలో ఉంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

జిల్లాలోని మండలాల వారీగా విత్తన సాగు ఎంత మేర చేపడుతున్నారంటూ.. మండల వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి క్షుణ్ణంగా ఆరా తీశారు.

రైతు వేదిక నిర్మాణాల్లో ప్రథమ స్థానంలో నిలపాలి

జిల్లాలో రైతు వేదికలు నిర్మించడంలో రాష్ట్రంలోనే సిద్ధిపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలపాలని మంత్రి హరీశ్ రావు కోరారు. జిల్లా వ్యాప్తంగా 126 రైతు వేదికలు నిర్మించ తలపెట్టినట్లు.. ఖచ్చితంగా యాసంగి పంట సమావేశాలు రైతు వేదికలో జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి సూచించారు.

జిల్లాలో రైతు రుణమాఫీ, రైతుబంధు పై సమీక్ష

జిల్లాలో రైతు రుణమాఫీకై 20 వేల మంది రైతులు ఉన్నారని, వీరికి రూ.25 వేలలోపు అప్పు ఉన్న 8600 మంది రైతులకు రైతు రుణమాఫీ వచ్చిందని, ఇంకా 12000 మంది రైతుల రుణమాఫీ విషయంలో వారి బ్యాంకు ఖాతాలలో ఆధార్ కార్డు అనుసంధానం అప్ డేట్ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.

జిల్లాలో నాలుగవ విడతలో భాగంగా రైతు బంధు కోసం 2 లక్షల 74 వేల 364 మంది రైతులు ఉన్నారని, వీరిలో 2 లక్షల 37 వేల 349 మంది రైతుల బ్యాంకు ఖాతాలకు అప్ డేట్ చేశారని, మరో 28, 621 మంది రైతుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ కార్డు అనుసంధానం యుద్ధ ప్రాతిపదికన రెండు రోజుల్లో అప్ డేట్ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.

శుక్రవారం రోజున తిరిగి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని, జిల్లాలో ఏ ఒక్క రైతుకు రైతుబంధు పెండింగులో ఉండొద్దని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, పలు మండలాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

విక్రమ సింహపురి యూనివర్సిటీ కి గ్రీన్ ఛాంపియన్ అవార్డు

Satyam NEWS

డిప్యూటీ స్పీకర్ ను కలిసిన ఓరుగంటి రెడ్డి రిజర్వేషన్ పోరాట సమితి

Satyam NEWS

తూర్పు గోదావరి జిల్లా లో అశ్లీల నృత్యాల ప్రదర్శన

Satyam NEWS

Leave a Comment