27.7 C
Hyderabad
April 26, 2024 05: 00 AM
Slider నల్గొండ

రైతు భీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

#MLASaidireddy

రైతు భీమా పథకాన్ని నియోజకవర్గ రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు సైదిరెడ్డి కోరారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం  ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భీమా పథకం అర్హతను ప్రతి రైతు పరిశీలించుకోవాలని ఆయన కోరారు.

జూన్ 16 వ తేదీ కి ముందు కొత్త పట్టా పాస్ పుస్తకాలు తీసుకున్న రైతులు, ఇప్పటి వరకు ఈ పథకానికి అర్హత ఉన్నా దరఖాస్తు చేసుకోని రైతులు ఉంటే తమ కొత్త పాసు పుస్తకం వివరాలు ఇవ్వాలని తెలిపారు.

పాసు పుస్తకం జిరాక్స్, MRO కార్యాలయం నుండి డ్రాఫ్ట్ కాపీ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, నామినీ ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని ఆయా మండల వ్యవసాయ అధికారికి ఈనెల 18వ తేదీ లోపుగా నమోదు చేసుకోవాలని సూచించారు.

ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Related posts

వ్యవస్థీకృత నేరాలపై దృష్టి సారించాలి: డిజిపి

Satyam NEWS

కరీంనగర్ లో దివ్యధామంగా టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయం

Satyam NEWS

గ్రూప్‌-1 కటాఫ్ 75-85 మధ్యలోనే |

Satyam NEWS

Leave a Comment