37.2 C
Hyderabad
March 29, 2024 20: 07 PM
Slider గుంటూరు

అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ట్ర రైతాంగం

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ వ్యతిరేక విధానాలు మూలంగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్న రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు కుటుంబాలు పూర్తి సంక్షోభంలో కూరుకుపోయారని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆరోపించింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ఈ నెల 21వ తేదీ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం మూడవ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. ఈ సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని కళామందిరం సెంటర్లో రైతాంగ బహిరంగ సభ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొనాలని పల్నాడు జిల్లా కౌలు రైతు సంఘం అధ్యక్షులు కామినేని రామారావు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి తాళ్లూరి పెద్దిరాజు కోరారు.

ఈ మేరకు నేడు పాలపాడు గ్రామంలో ప్రచారం నిర్వహించారు. సాగర్ కాలువలకు నీరు వస్తున్నా వరి పంట వేసుకోలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారని, మద్దతు ధరలు కూడా రైతులకు దక్కక మద్దతు ధరల కంటే తక్కువ ధరకే వరి ధాన్యం అమ్ముకుని తీవ్రంగా నష్టాలు పాలవుతున్నారని వారు తెలిపారు. ఈ సందర్భంలో కౌలు రైతులు వ్యవసాయ భూములను వదిలేస్తున్నారని, కౌలు రైతులకు చట్టం ఉన్నప్పటికీ సక్రమంగా అది అమలు జరగటం లేదన్నారు. ఏపీ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణంలోని కళామందిరం సెంటర్లో ఈనెల 21వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు జరిగే బహిరంగ సభ లో ఢిల్లీ రైతుల ఉద్యమంలో చివరిదాకా పాల్గొన్న ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు విజ్జు కృష్ణన్, ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. శ్రీనివాసరావు, కౌలు రైతులు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వై. రాధాకృష్ణ, హరిబాబు పాల్గొని ప్రసంగిస్తారు కావున ఈ బహిరంగ సభలో యావన్మంది రైతాంగం పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కొమ్ముల నాగేశ్వరరావు, బత్తుల బాలకోటయ్య, పుల్లారెడ్డి, చిన్న, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆటో అదుపు తప్పడంతో ఇద్దరు యువకుల మృతి

Satyam NEWS

గిఫ్ట్ టు హానెస్ట్:ఈ.ఓ కృష్ణ వేణి సస్పెన్షనా?బ(ది)లి నా ?

Satyam NEWS

బిఆర్ఎస్ పార్టీకి.. కెసిఆర్ కే మా మద్దతు..

Satyam NEWS

Leave a Comment