35.2 C
Hyderabad
April 20, 2024 18: 47 PM
Slider నిజామాబాద్

తరుగు పేరుతో ధాన్యం ధర తగ్గించడం అన్యాయం

#AarmoorCongress

తరుగు పేరుమీద రెండు కిలోల కడతా తీసుకోవడం దారుణమని సంచి వెయిట్ ఎంత ఉంటే అంతే తీసుకోవాలి గానీ రెండు కిలోలు తీసుకోవడం మంచి పద్ధతి కాదని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. నేడు ఆయన నిజామాబాద్ జిల్లా హాసాకొత్తూరు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా రైతులు ఆయనకు ఫిర్యాదు చేస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రెండు కిలోల తరుగు తీస్తున్నారని, హమాలీల కొరత వల్ల కాంటా వేసిన సంచులు లోడింగ్ కావడం లేదని తెలిపారు.

ఇది రైతులను మోసం చేయడమే అవుతుందని ఈ విషయంలో మంత్రిగ చొరవ తీసుకోవాలని మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే హమాలీల కొరత లేకుండా చూడాలని, కాంటా వేసిన సంచులను తొందరగా లోడింగ్ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు రెండు రోజుల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకెట రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పి రెడ్డి శ్రీనివాస్, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు పడిగెలా ప్రవీణ్, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణు రాజ్, పిఎసిఎస్ డైరెక్టర్ ఏనుగు రాజేశ్వర్ మరియు గోపిడి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇంకా కేరళను తాకని రుతుపవనాలు

Satyam NEWS

తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన పునఃప్రారంభం

Satyam NEWS

కదం తొక్కిన కర్షకులు: మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్

Satyam NEWS

Leave a Comment