21.7 C
Hyderabad
December 4, 2022 00: 46 AM
Slider నల్గొండ

టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

#cong

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయము ఎదుట పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిరసన ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. నల్లగొండ పార్లమెంటు సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తంకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు అధ్యక్షతన తెలంగాణ రైతు సమస్యలపై తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన,ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగని నాగన్న గౌడ్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ నిజాముద్దీన్,పిసిసి సభ్యుడు దొంగరి వెంకటేశ్వర్లు,ఈడుపుగంటి సుబ్బారావు, పిసిసి జాయింట్ సెక్రెటరీ మహ్మద్ అజీజ్ పాషా,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చక్కెర వీరారెడ్డి, మాజీ జెడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు,రైతు సంఘం అధ్యక్షుడు పులిచింతల అంజిరెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాచిమంచి గిరిబాబు తదితరులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల వివక్షత చూపుతోందని,ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన లక్ష రూపాయల ఋణమాఫీ ఇంతవరకు మాఫీ చేయలేదని,రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించలేదని అన్నారు.

ప్రకృతి వైపరీత్యాలనుండి రైతులను ఆదుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.ధరణి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సంస్కరణలు లాభాల కంటే రైతులకు ఎక్కువ సమస్యలు తెచ్చిపెడుతుందని అన్నారు.తక్షణమే ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని,పంట కొనుగోలు విషయంలో రైతులు పండించే పంటకు మద్దతు ధర చెల్లించకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని ఎద్దేవా చేశారు.టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరినుండి పోడు భూముల సమస్యను పరిష్కరించకుండా ఎన్నికలలో ఓటు బ్యాంకుకు మాత్రమే పరిమితమైందని అన్నారు.

రైతుల సమస్యల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేంతవరకు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు దొంతిరెడ్డి సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి యడవల్లి వీరబాబు, ఉపాధ్యక్షుడు గొట్టేముక్కల రాము, ఎంపీటీసీ సభ్యులు ఎం.వీరబాబు లింగగిరి, గ్రామ శాఖ అధ్యక్షుడు సిహెచ్.రాఘవయ్య, లక్కవరం గ్రామ శాఖ అధ్యక్షుడు చామకూరి సైదులు,ఐ ఎన్ టి యు సి నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య, మండల అధ్యక్షుడు మేళ్ళచెరువు ముక్కంటి, పోతనబోయిన రామ్మూర్తి,చింతకాయల రాము, కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు చప్పిడి సావిత్రి,ఎస్సీ సెల్ కన్వీనర్ అంజన్ పల్లి సుదర్శన్, మాజీ ఎంపీటీసీ ముశం సత్యనారాయణ,పట్టణ బూతు కమిటీ అధ్యక్షుడు కంకణాల పుల్లయ్య, ఇంటిమల్ల బెంజిమెన్,పోతుల జ్ఞానయ్య, దాసరి పున్నయ్య,దొంతగాని జగన్, రేపాకుల కోటయ్య,పాశం నారాయణ, రైతు సంఘం నాయకులు సత్యనారాయణ, ఎస్.వీరబాబు,దేవరం పాపిరెడ్డి, శ్రీనివాసరెడ్డి,కాల్వ శ్రీనివాసరావు, శ్రీనివాసపురం కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు వినోద్,సూర్య నాయక్,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

కొల్లాపూర్ లో అధికారి సంతకం ఫోర్జరీ: అయినా పోలీస్ కేసు లేదు

Satyam NEWS

2003 లో పట్టాలిచ్చి… నేటికి హద్దులు చూపరా..?

Satyam NEWS

ట్రంప్ ఎఫెక్టు:రోడ్డున పడ్డ 45 పేద కుటుంబాలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!