27.7 C
Hyderabad
April 26, 2024 03: 17 AM
Slider శ్రీకాకుళం

సాగునీరు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం

#AmudalavalasaFarmers

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కొర్లకోట పరిసర ప్రాంతాలలో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితి నెలకొంది. దీంతో వ్యవసాయాన్నే నమ్ముకున్న అక్కడి రైతులు ఇబ్బంది పడుతున్నారు.

పంటలు ఎండిపోయి నేల బీటలు బారి పోవటంతో ఆవేదన చెందుతున్నారు. ఈ పరిసర ప్రాంత భూములకు నారాయణపురం ఆనకట్ట నుంచి వచ్చే గడ్డ నీరు ఆధారంగా ఉంటుంది.

అయితే ఈ ఏడాది ఆ గడ్డ కూడా ఆధునిక పనులు పేరుతో మరమ్మత్తులు చేపట్టడంతో నీరు రాకుండా పోయింది. దీంతో నేడు బిజెపి నాయకులు పేడాడ సురపు నాయుడు, జనసేన నాయకులు రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

తక్షణమే ఈ కాలువ గుండా నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఎండిన పొలాలకు తక్షణమే పరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పేడాడ రామ్మోహన్ బెండి రవికాంత్, నర్సింగరావు, ప్రసాదరావు,ధనుంజయ రావు, నరసింగరావు కోదండరావు, ఢిల్లీశ్వర రావు రైతులు పాల్గొన్నారు.

Related posts

అక్టోబర్ 21న హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక

Satyam NEWS

శ్రీశైలం స్వామికి ఇంద్రకీలాద్రి నుంచి పట్టు వస్త్రాలు

Satyam NEWS

గణపతి సరెండరవుతారన్నది ఓ కట్టు కథ

Satyam NEWS

Leave a Comment