28.7 C
Hyderabad
April 20, 2024 10: 52 AM
Slider మెదక్

అధికారులూ నా చావు మీకే అంకితం

Wargal Farmer

ఒక రైతు తన పొలం కోసం పడరాని పాట్లు పడ్డాడు. చివరివరకూ సమస్య తీరలేదు. ఎవరూ స్పందించలేదు. దాంతో పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలాడు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన దళిత రైతు నర్సింలు ముగిగిసిపోయిన దీన గాధ ఇది.

ఎంఆర్ వో ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి పని కాకపోవడంతో ఆడియో మెసేజి పెట్టి అతను పురుగుల మందు తాగాడు. ఈ సంఘటనపై మంత్రి హరీష్ రావు స్పందించారు. మృతుడి భూమిని టీఆర్ఎస్ ప్రభుత్వం బలవంతంగా తీసుకుందనే ఆరోపణలల్లో ఏ మాత్రం నిజం లేదని రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి హరీష్ రావు అంటున్నారు.

మృతుడి భూమిని కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే సబ్ స్టేషన్ కోసం స్వాధీనం చేసుకున్నారని ఆయన తెలిపారు. రైతు మృతికి గల కారణాలపై లోతైన విచారణ జరిపిస్తామని ఆయన తెలిపారు.

ఎక్స్రే గ్రేషియా తో పాటు ఎకరం భూమి, తక్షణ సహాయంగా రూ.2 లక్షలు అందజేస్తున్నామని, మృతుడి కుమార్తెను ప్రభుత్వ ఖర్చులతో చదివిస్తామని మంత్రి తెలిపారు. దోషులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని మంత్రి వెల్లడించారు. మృతుడి కుటుంబానికీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన తెలిపారు.

Related posts

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

Satyam NEWS

అందరూ చూస్తుండగానే వేట కొడవళ్లతో దారుణ హత్య

Satyam NEWS

మండల స్థాయి సిఎం కప్ 2023 ను విజయవంతం చేయాలి

Satyam NEWS

Leave a Comment