కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన సుగంధద్రవ్యాల బోర్డును స్వాగతిస్తున్నట్లు జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక ప్రకటించింది. అదే విధంగా పసుపు పంటకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించాలని కోరారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో మాదిరిగా బోనస్ ఇవ్వాలని కూడా ఐక్యవేదిక ప్రతినిధులు కోరారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలని కూడా వారు కోరారు. ఇది పంట చేతికి వచ్చిన సమయం కాబట్టి ఇంకో నెల లోపల పంట అమ్ముకునే సమయం కాబట్టి రైతులకు నష్టం రాకుండా చూడాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన సుగంధద్రవ్యాల బోర్డు ఏర్పాటుకు ప్రత్యేక చర్య తీసుకున్న స్థానిక ఎం.పి అరవింద్ కు రైతులు కృతఙ్ఞతలు తెలిపారు.