36.2 C
Hyderabad
April 25, 2024 20: 43 PM
Slider మహబూబ్ నగర్

అసత్పూర్ భూములు సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వాలి

#CPMparty

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం సలీం అధ్యక్షతన సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్ధo పర్వతాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్లాపూర్ సంస్థాన పరిధిలో భూములు సాగు చేసుకుంటున్న రైతులకు సాగు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యాలు రాజరికాలు పోయినా వేల ఎకరాల భూమిని తన ఆధీనంలో పెట్టుకొని ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్న రాజా గారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం తక్షణమే పట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు అనేక సంవత్సరాలుగా భూమి సాగు చేసుకుంటున్నారు. భూమి పట్టాలు కావాలని దశల వారి ఉద్యమాలు నిర్వహించిన నేటికీ ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. రైతులకు పట్టాలిచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

జిల్దార్ తిప్ప చెరువుకు సాగునీరు అందించి ముక్కిడి గుండం మల్ల చింతలపల్లి గ్రామాల రైతులకు సాగునీరు అందించాలని వారన్నారు. పక్కనే పాలమూరు రంగారెడ్డి కే ఎల్ ఐ ప్రాజెక్టులు సుదీర్ఘ ప్రాంతాలకు సాగునీరు అందిస్తున్న పక్కనున్న గ్రామాలకు మాత్రం అందించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి జిల్దార్ తిప్ప చెరువుకు సాగినీరు అందించి రైతంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. లేకపోతే ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు డి ఈశ్వర్, నరసింహ, కొల్లాపూర్ మండల కార్యదర్శి బి శివ వర్మ, మండల కమిటీ సభ్యులు బాలపిరు, కిరణ్ కుమార్, భాస్కర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎల్లో మీడియా ద్వారా బాబు జగన్ పాలనను అప్రతిష్ట చేస్తున్నారు

Satyam NEWS

జూమ్ యాప్ ద్వారా బ్రాహ్మణ వివాహ వేదిక

Satyam NEWS

చంద్రన్న నరసరావుపేట పర్యటన విజయవంతం చేద్దాం

Satyam NEWS

Leave a Comment