37.2 C
Hyderabad
March 29, 2024 18: 56 PM
Slider ఖమ్మం

అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

#newdemocracy

రాష్ట్ర  వ్యాప్తంగా గత మూడు రోజులుగా ఈదురుగాలులతో కురుస్తున్న అకాల వర్షాలకు వేలాది ఎకరాలలో మిర్చి రైతులకు భారీ నష్టం వాటిల్లిందనినష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్రప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుమలాయపాలెం మండలం బచ్చోడులో  న్యూడెమోక్రసీ నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సదర్భంగా న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి పండించిన పంటలు గులాబీ తుపాను వల్ల వచ్చిన అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయాయని, నష్టపోయిన మొక్కజొన్న,మిర్చి,మామిడి పంటలను ప్రభుత్వం పరిశీలించి, వ్యవసాయ అధికారులతో సర్వే చేసి నష్టపోయిన రైతాంగానికి మొక్కజొన్న పంటకు ఎకరాకు 50 వేలు, పత్తి,మామిడి పంటలకు ఎకరానికి ఒక లక్ష రూపాయలు, మిర్చికి 10 లక్షల చొప్పున నష్టపరిహారం  చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో  సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుమలాయపాలెం మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్ మండల నాయకులు వీరస్వామి, బింగి శ్రీను, విద్యా కమిటీ చైర్మన్ నందిపాటి రామకృష్ణ, పులిపలుపుల రాములు, కుమ్మరి కుంట్ల రాములు,అంగిరేకుల వెంకన్న,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Related posts

నకిలీ డాక్టర్ ఆటకట్టించిన పోలీసులు

Bhavani

విజయనగరం కలెక్ట్రెట్ లో సా దా సీదా గా అమరజీవి వర్ధంతి…!

Satyam NEWS

మంత్రి గౌతమ్ రెడ్డి కి ఎంపీ ఆదాల శ్రద్ధాంజలి

Satyam NEWS

Leave a Comment