40.2 C
Hyderabad
April 24, 2024 17: 15 PM
Slider కృష్ణ

న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతుంది

#FarookhShibly

దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఈ రోజు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించింది.

ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ నేతలు ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్‌ జోషితో పాటు సంఘ్ ‌పరివార్‌ నేతలు చాలా మంది ఉన్న విషయం తెలిసిందే.

నిందితులపై సీబీఐ అభియోగాలు నిరూపించలేక పోయిందని, కుట్ర పూరితంగా ఏమి జరగలేదని కోర్టు తెలిపి తీర్పు ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లే విధంగా ఈ తీర్పు ఉన్నదని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ అభిప్రాయపడ్డారు.

అయితే న్యాయం అనేది చాలా గొప్పది ఒక సమాజంలో శాంతి భద్రతలు వెల్లివిరియాలంటే ఆ సమాజంలో కుల, మత, వర్గ, వర్ణ వైషమ్యాలు లేకుండా సమన్యాయం జరగాలని ఆయన అన్నారు.

ఉన్నత న్యాయస్థానానికి అప్పీలుకు వెళ్లేందుకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపారు.

Related posts

అమ్మ నాన్న వృద్ధాశ్రమంలో కాపు నేత తోట కృష్ణయ్య పుట్టినరోజు

Satyam NEWS

డబ్బు గుంజుతున్న రిపోర్టర్ల అరెస్టు

Satyam NEWS

అభివృద్దిని చూడలేని కబోదులు….కాంగ్రెస్ వారు

Satyam NEWS

Leave a Comment