38.2 C
Hyderabad
April 25, 2024 14: 28 PM
Slider విజయనగరం

ఆస్తి కోసం  క‌న్న‌వారు చేసిన కిరాత‌కం…!

#RajakumariIPS

పెళ్లైన వాళ్ల‌కు పిల్ల‌లు పుట్ట లేదు. దీంతో ఓ మ‌గ‌పిల్లాడిని పెంచుకున్నారు. ఆ పిల్లాడు కాస్త పెరిగి పెద్ద‌వుతున్న స‌మ‌యంలో ఆ క‌న్న‌వారికి సంతానం క‌లిగి పండింటి మ‌గ బిడ్డు జ‌న్మ‌నిచ్చారు.

సీన్ క‌ట్ చేస్తే..ఆస్తి కోసం పెంచిన కొడుకు అడ్డొస్తాడ‌ని ఆ క‌న్న‌వారు అతి క్రూరంగా సుపారీ గ్యాంగ్ తో పెంచిన మ‌మ‌కారాన్ని చేతులా తెంచేసుకున్నారు. చివ‌ర‌కు  శ్రీకృష్ణ జ‌న్మ‌స్థానానికి చేరుకున్నారు.  ఈ దారుణం విజ‌యన‌గ‌రం  జిల్లా నెల్లిమ‌ర్ల  పోలీస్ స్టేష‌న్ ప‌రిధి మ‌ల్యాడ‌లో జ‌రిగింది.

ఇందుకు సంబంధించిన  వివ‌రాల‌ను జిల్లా ఎస్పీ రాజ‌కుమారీ మీడియాకు తెలియ చేసారు. ఎస్పీతో  పాటు డీఎస్పీ అనిల్,సీఐ మంగ‌వేణి, ఎస్ఐలు లీలావ‌తి, దామోద‌ర‌రావులు ఉన్నారు. ఈ కేసు ద‌ర్యాప్తులో భాగంగా ఎస్పీ స్వ‌యంగా ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని మరీ  విచార‌ణ జ‌రిపి నిందితుల‌ను ప‌ట్టుకున్నారు.

ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి. మార్చి 18న  జిల్లాలోని నెల్లిమర్ల మండలం మల్యాడ పంచాయతీ మధుర వెంకటన్నపాలెం గ్రామం జగ్గునాయుడు చెరువులో 24 ఏళ్ల‌ వయస్సు కలిగిన గుర్తు తెలియని ఓ వ్య‌క్తి మృత‌దేహం  తాళ్ళుతో కట్టిన‌ట్టు గుర్తించారు…గ్రామ‌స్తులు.

వెంట‌నే వీఆర్వో ఇచ్చిన స‌మాచారం మేర‌కు నెలిమర్ల ఎస్ఐ దామోద‌ర‌రావు…కేసు క‌ట్టి ద‌ర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందిన వ్యక్తిని గుర్ల మండలం పున్నపురెడ్డి పేటకి చెందిన పున్నపురెడ్డి ప్రసాద్ గా గుర్తించి, హత్యకు గల కారణాలను అన్వేషించ‌డం ప్రారంభించారు.

పున్నపురెడ్డి పేటకు చెందిన పున్నపురెడ్డి సీతమ్మ, సత్యం దంపతులకు పిల్లలు లేక‌పోవ‌డంతో వారి తమ్ముడు కుర్రాడైన పున్నపురెడ్డి ప్రసాద్ ను పెంచుకుంటున్నారు. అనంత‌రం వారికి ఓ కొడుకు పుట్ట‌డంతో… ప్రసాద్ ను నిర్లక్ష్యం చేస్తూ వ‌చ్చారు.

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని…..

ఈ  క్రమంలో పున్నపురెడ్డి సీతమ్మ అదే గ్రామానికి చెందిన పున్నపురెడ్డి రామారావుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. సదరు విషయం పున్నపురెడ్డి ప్రసాద్ కు తెలిసి రామారావు, సీతమ్మను తరుచూ ప్రశ్నించేవాడు.

తమ వివాహేతర సంబంధానికి ప్రసాద్ అడ్డుగా ఉన్నాడని భావించిన  సీతమ్మ దంప‌తులు పెంచిన‌ కొడుకు ప్రసాద్ ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించి,  మేనల్లుడైన యడ్ల రాంబాబు, అత‌ని కొడుకు సహాయం కోరి…. అడ్వాన్సుగా  10వేలు ఇవ్వడం, హత్య తరువాత మరో .10వేలు ఇవ్వడానికి, అదే విధంగా 0.35 సెంట్లు భూమిని కూడా ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

అవకాశం కొరకు వేచి చూస్తున్న వీరికి, పున్నపురెడ్డి ప్రసాద్ గత నెల 16న చీపురుపల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జాతరకు వెళ్ళి, తిరిగి రాత్రి సమయంలో మద్యం మత్తులో వచ్చి పశువుల కల్లంలో ఉన్నట్లుగా గుర్తించారు.

దానిని అవకాశంగా తీసుకున్న నిందితులు పున్నపురెడ్డి సీతమ్మ  పున్నపురెడ్డి సత్యం  యడ్ల రాంబాబు పున్నపురెడ్డి రామారావు , సీతమ్మ కుమారుడైన జువినల్  అంతా ఒక్కటై, మద్యం మత్తులో ఉన్న ప్రసాద్ ను అంతం చేసారు.. ప్రసాద్ ను హత్య చేసిన తరువాత మృతదేహాన్ని  నెల్లిమర్ల మండలం వెంకన్నపాలెం గ్రామ పొలిమేరలో రోడ్డు ప్రక్కన గల చెరువులో పడేసారు..

ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా  ప్రసాద్ చీపురుపల్లి జాతరకు వెళ్ళి తిరిగి ఇంటికి రానట్లు, ఎప్పటికప్పుడు ప్రసాద్ ఇదే విధంగా ఎవరికీ చెప్పకుండా ఇల్లు విడిచి వెళ్ళిపోయి తిరిగి వచ్చేవాడని గ్రామస్థులను నమ్మించారు.

అయితే ఆ స‌మయంలోనే నెల్లిమ‌ర్ల పోలీసుల‌కు…పెంచిన‌కొడుకు క‌నిపించ‌లేద‌ని ప్ర‌సాద్ క‌న్న‌వారు ఫిర్యాదు చేయ‌లేదు స‌రిక‌దా…అదే స‌మ‌యంలో ప్ర‌సాద్ కు జ‌న్మ‌నిచ్చిన క‌న్న‌వారు…త‌మ కొడుకు క‌నిపించ‌టం లేద‌ని పోలీసుల‌కు పిర్యాదు చేసారు.

అదే స‌మ‌యంలో చెరువులో ల‌భ్య‌మైన మృత‌దేహం ప్ర‌సాద్ గా గుర్తించిన నెల్లిమ‌ర్ల పోలీసులు…ద‌ర్యాప్తు చేసి తీగ‌లాగితే డొంక క‌ద‌లిన‌ట్టు..పెంచిన క‌న్న‌వారి  దారుణం బ‌ట్ట బ‌య‌లైంది.

ఎం.భరత్ కుమార్

Related posts

వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి

Satyam NEWS

#NBK 105 చిత్రం పేరు రాయల సింహ?

Satyam NEWS

కెసిఆర్ ను గద్దె దించడమే లక్ష్యం

Murali Krishna

Leave a Comment