36.2 C
Hyderabad
April 25, 2024 19: 04 PM
Slider ముఖ్యంశాలు

అనారోగ్యంతో ఉన్న కుమార్తెను కాపాడుకోవడానికి తండ్రి తపన

#GnanaDeepti

మూత్రపిండాలు దెబ్బతిన్న తన కుమార్తెను బతికించుకోవడానికి ఒక తండ్రి పడుతున్న ఆవేదన ఇది. డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన పసుపులేటి శ్రీనివాసరావు దీనగాధ ఇది. పత్రికా విలేకరులకు ఆయన అందచేసిన లేఖ ఇది:

అందరకీ నమస్కారములు, నా పేరు పసుపులేటి శ్రీనివాసరావు మా ఊరు కమలాపురం(గ్రా), మంగపేట(మం), ములుగు(జిల్లా)ఉమ్మడి వరంగల్

నా కుమార్తె జ్ఞాన దీప్తి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఇన్ఫెక్షన్ అయి రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. దాని వలన లివర్, ఊపిరితిత్తులు, గుండె కు డ్యామేజ్ జరిగింది. పాపకు వ్యాధి కలిగినప్పుడు దగ్గు, ఆయాసం, నిద్రలేమి, శ్వాసతో ఇబ్బంది పడింది. మాకు జబ్బు లక్షణాలు తెలియక ముందు చెస్ట్ హాస్పటల్ లో చికిత్స చేయించాము. తర్వాత స్పెషలిస్టు డాక్టర్ దగ్గర చూపించాము

రోజు రోజుకీ పరిస్థితి విషమిచడం వలన డాక్టర్లు హైదరాబాద్ తీసుకువెళ్ళమన్నారు. వెంటనే పాపను హైదరాబాద్ తీసుకువెళ్ళాము. అక్కడ నిమ్స్ హాస్పటల్ లో చేర్చితే వాళ్ళు వెంటిలేటర్ లేదు పాప పరిస్థితి బాగాలేదు తొందరగా వెంటిలేటర్ పెట్టకపోతే పాప చనిపోతుంది అన్నారు.

అప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. చేతిలో డబ్బులు లేవు పాప ను చూస్తే ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. డబ్బులు ఎక్కువ అయినా ప్రవేట్ హాస్పటల్ (కేర్) లో చేర్పించాము. అక్కడ మూడు రోజులకు రూ.4,50,000 ఖర్చు అయినాయి. నేను డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న సామాన్యుడను.

అంత డబ్బులు పెట్టలేక SVR మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ హన్మకొండ లో చేర్పించాము. ఇక్కడ అ హాస్పిటల్ లో పాపను చేర్పించిన తరువాత డాక్టర్లు పాప కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది 20 రోజులు పైగా వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందిస్తూ డయాలసిస్ చేయాలి అని అన్నారు.

రోజుకు 50 నుండి 60 వేల రూపాయల ఖర్చు వస్తుంది. ఇప్పటికే మొత్తం హైదరాబాద్ లో గాని హన్మకొండ (వరంగల్) హాస్పిటల్ కానీ 9 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. ఇప్పటి నుండి ట్రీట్మెంట్ కంటిన్యూ చేయించడానికి నా దగ్గర డబ్బులు లేవు. దయచేసి ఇప్పటివరకు నాకు సహాయం అందించిన మీరు మా పాప ఆరోగ్యం బాగుచేయించుకోవడానికి సహాయం అందించగలరని కోరుకుంటున్నాను.

పసుపులేటి శ్రీనివాసరావు

నా ఫోన్ ఫే,గూగుల్ ఫే నెంబర్:-9440717951

నా అకౌంట్ నెంబర్:- SBI 33077472404, IFC Sbin 0006294

( మాకు అందిన సమాచారాన్ని అందిస్తున్నాము. సహాయం చేసేవారు వాస్తవ పరిస్థితి స్వయంగా నిర్ధారించుకోవాలి)

Related posts

రికార్డు స్థాయి ఆదాయం పొందిన కోటప్పకొండ

Satyam NEWS

ఆధార్ కార్డు లేక పోయిన తల్లీ ప్రాణం

Satyam NEWS

వ్యవసాయ ట్రాన్సఫార్మర్ల చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులు అరెస్టు

Satyam NEWS

Leave a Comment