35.2 C
Hyderabad
April 20, 2024 18: 08 PM
Slider ప్రకాశం

ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం

#newbornbaby

ఒంగోలులో దారుణం చోటుచేసుకుంది. కొండపి మండలం కట్టవారి పాలెం గ్రామానికి చెందిన కాంతుల గంగ అనే మహిళ ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో సోమవారం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆడపిల్ల పుట్టడం ఆమె భర్త రమణకు ఇష్టం లేకపోయింది. దీంతో పాపను తీసుకుని మంగళవారం ఉదయం బయటికి వెళ్లాడు. ఒంగోలు మంగమూరు రోడ్డులోని ముళ్ళ పొదల్లో వదిలేసి వెళ్లాడు. చిన్నారి అరుపులు విన్న స్థానికులు.. చైల్డ్ లైన్ సిబ్బందికి సమాచారం అందించారు. చైల్డ్ లైన్ సిబ్బంది, తాలూకా పోలీసులు వెంటనే స్పందించారు. సంఘటన స్థలానికి చేరుకొని పాపను రక్షించారు. అనంతరం చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. పాప ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. పాపను ముళ్లపొదల్లో వదిలివెళ్లిన తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Related posts

కేసీఆర్ దార్శనిక పాలన వల్లే తెలంగాణ సుభిక్షం

Satyam NEWS

మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టవద్దు

Satyam NEWS

2024లో టిడిపి లీడింగ్ వార్తతోనే అరాచకశక్తుల పరార్!

Satyam NEWS

Leave a Comment