34.2 C
Hyderabad
April 23, 2024 14: 44 PM
Slider కవి ప్రపంచం

నాన్నకు ప్రేమతో..

#Purimalla Sunanda New

నాన్నా!

ఎప్పుడూ పనులంటేనే ఇష్టం

మామీద లేదని అనుకున్న

నా అమాయకత్వం..

అహర్నిశలు నువ్వు ఎవరి కోసం కష్టపడుతున్నావో తెలిసిన రోజు…

క్రమశిక్షణే జీవన శైలికి చిరునామా యని

మమ్మల్ని మందలించినప్పుడు

నువ్వు ఇంట్లో కాదు మిలిట్రీలోనే ఉండాలనుకున్న

నా మూర్ఖత్వం..

ఉద్యోగంలో నా విజయ సాధనకు మూలం 

నీవు నేర్పిన క్రమశిక్షణేననీ…

అందరు పొగిడినా

ఎన్నడూ మెచ్చుకోని నిన్ను చూసి

నాన్నకు అసలు ప్రేమంటే తెలియదని నిరసనగా అనుకున్న క్షణాలను వమ్ము చేసిన సమయం…

ఆకాశమంత అనురాగంతో నాగురించి చెప్పిన మాటలు విన్నప్పుడు…

నా అపోహలు మబ్బు తెరలై విడిపోయాయి నాన్నా!..

నీ అపురూపమైన  ప్రేమలో మాధుర్యం

మా కలలు నిజం చేయడానికి అనుక్షణం

మా భవిష్యత్ కోసం పడిన తపన

అర్థమయ్యాక తెలిసింది నాన్నా!

నాలో ప్రవహించే జీవిత నది నీవేననీ..

నాన్నా! నీవు నేను అభేదమనీ!

నాన్నకు ప్రేమతో ..

నేనిచ్చేది కలలు సాకారం చేయడమేనని..

వురిమళ్ల సునంద, ఖమ్మం, 9441815722

Related posts

వైజాగ్ నుంచి వారణాసికి సూపర్ ఫాస్ట్ రైల్ కు సర్వే ప్రారంభం

Satyam NEWS

గర్భాశయ క్యాన్సర్ కు తొలి దేశీయ వ్యాక్సిన్ సిద్ధం

Satyam NEWS

వనపర్తి అనూస్ అకాడమీ హై స్కూల్  విద్యార్థుల ప్రతిభ

Satyam NEWS

Leave a Comment