30.7 C
Hyderabad
April 19, 2024 10: 19 AM
Slider కవి ప్రపంచం

“నాన్న”

#CSRambabu

అవును అతను నిశ్శబ్దనదిలా

దూరంగా వినిపించే సెలయేటిపాటలా 

నువు దాచేసిన 

నీ అంతరంగంలో మెరుపుచుక్కలా మెరుస్తూఉంటాడు…

నిను అదిలించి బుజ్జగిస్తూ

విసిగిస్తూ కోపగిస్తూ

నీ తప్పటడుగులనుంచి

నీ తప్పుటడుగులవరకూ

నీలోని మరోమనిషిలా

నిలదీస్తూనే ఉంటాడు…

అక్కడో జ్ఞాపకాలతోట విరుస్తోంది

నువ్వొద్దనుకున్నా

నీకోసమో పువ్వేదోపూచినట్టు

అతని జ్ఞాపకం అక్కడ గాలిపరిమళమై వీస్తూ ఉంటుంది…

కదంబవనమై విరబూసే కుటుంబంలో

ఒంటరి దీపస్థంభంలా

అతను 

తపనో బెంగో చింతో తెలియని

పారవశ్యంతో

నీప్రేమగీతాన్ని నిరంతరం లిఖిస్తూ ఉంటాడు…

పండువెన్నెలలాంటి నీ జీవితంలో

తను మోడువారినబీడై

నీ ప్రేమపలకరింపుతో చిగురించుదామని

కలలసౌధానికి కళ్ళెంవేద్దామని విఫల ప్రయత్నం చేస్తూ ఉంటాడు

అతనే నాన్న

అందరికన్నా మిన్నగా

నీ ఠీవిని ఎగరేసే తొలి పతాక

నీ కీర్తితారక…

సి.యస్.రాంబాబు

Related posts

చైనా దుష్ట పన్నాగమే శ్రీలంక పతనానికి కారణం

Satyam NEWS

రామ్ గోపాల్ వర్మ కార్యాలయంపై దాడి

Satyam NEWS

విరాట్ కోహ్లి నిర్ణయంపై రోహిత్ శర్మ దిగ్భ్రాంతి

Satyam NEWS

Leave a Comment