32.2 C
Hyderabad
March 29, 2024 00: 33 AM
Slider కవి ప్రపంచం

జీవనది

#PVS Krishnakumari

నాన్న….

జీవితానికి ఆలంబన, ధ్యైర్యం

ఇవ్వటమే గానీ, తీసుకోవటం

తెలియని స్వచ్ఛమైన

ప్రేమ స్వరూపి నాన్న

మన జీవితాలకు దిశా నిర్దేశం

చేసే మార్గదర్శకుడు నాన్న

కఠిన శిల మధ్య స్వచ్ఛమైన జల

నాన్నా మనసు

అనునయపు మాటలు ఉండవు

ఆచరణే  ఆయన ధ్యేయం

ఆయన ప్రేమ‌ఒక మహా సముద్రం

తుఫానులకు చలించక

వేళ్ళూనుకుని స్థిరంగా నిలిచే

మర్రి వృక్షం నాన్న ప్రేమ

కొండలు, కోనలు దాటుకుంటూ

మాలిన్యాలని, రాళ్ళు రప్పలు

తనతో తీసుకెళుతూ,

మంచినీటిని మాత్రమే అందించే

జీవనది నాన్న గమనం

నాన్నా….

ఆ పిలుపే బలాన్నిచ్చే ఔషధం

పసిడి లోని మాలిన్యాలను

తొలగించటానికి పెట్టే పుటం

నాన్న కోపం.

బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపేందుకు

అహర్నిశలు నాన్న పడే కష్టానికి,

ప్రతిఫలం ఆశించని ఆ  ప్రేమ గురించి

చెప్పటమంటే ,సూర్యభగవానునికి

కర్పూర హారతి ఇవ్వటం లాంటిదే

మేరు పర్వతమంత సమానమైన

నాన్న వ్యక్తిత్వానికి, ప్రేమకు

ఇదే నా వందనం

పీ.వి.యస్. కృష్ణ కుమారి

Related posts

మూడు నెలలో 224 ప్రమాదాలు..67 మంది మృతి..

Satyam NEWS

ఆ పుస్తకాన్నిపిల్లలే కాదూ పెద్దలూ చదవాల్సిందే!

Sub Editor

చిత్తూరు జిల్లా వైసీపీలో పెచ్చరిల్లిన గ్రూపు తగాదాలు

Satyam NEWS

Leave a Comment