37.2 C
Hyderabad
March 29, 2024 17: 57 PM
Slider ప్రపంచం

Danger Signal: ఫైజర్ వ్యాక్సిన్ వినియోగంలో విపరీత పరిణామాలు?

#PfizerClenicalTrails

దారుణం జరిగిపోయింది. ఫైజర్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ ట్రయల్ రన్ లో ఇద్దరు మరణించారు. ఈ విషయాన్ని అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తన వెబ్ సైట్ లో ఉంచిన పరిశోధనా పత్రంలో పేర్కొన్నది.

కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ లో భాగంగా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఇద్దరు వ్యక్తులు అతి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్ తో మరణించారని ఆ పత్రంలో పేర్కొన్నారు.

ఫైజర్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో ఒక 55 సంవత్సరాల వ్యక్తి హృదయ సంబంధిత రుగ్మతతో మరణించారు. మరో వ్యక్తి కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రెండు మూడు రోజుల తర్వాత కండరాల వాపు వ్యాధితో మరణించారు.

ఎఫ్ డి ఏ వెలువరించిన ఈ పరిశోధనాత్మక వ్యాసంతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలుగుతున్నది. కరోనా వ్యాక్సిన్ భద్రతపై పెను దుమారం రేగుతున్నది.

ఈ పరిణామాల దృష్ట్యా కరోనా వ్యాక్సిన్ ను నిర్బంధం చేయడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

రేపు (డిసెంబర్ 10), ఆ తర్వాత డిసెంబర్ 17న ఎఫ్ డి ఏ మరో రెండు పబ్లిక్ డాక్యుమెంట్లు విడుదల చేయబోతున్నట్లు కూడా తెలిసింది.

(ఎఫ్ డి ఏ ఇచ్చిన ఈ సమాచారాన్ని విడుదల చేసింది కేవలం సమాచారం కోసం మాత్రమే తప్ప ప్రజలకు ఆందోళన కలిగించేందుకు కాదు)

Related posts

నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం

Satyam NEWS

పోక్సో కేసులపై దృష్టి పెట్టండి…!

Satyam NEWS

అధికార పార్టీ ఎమ్మెల్యే అక్రమాలను ప్రశ్నిస్తే దాడి చేస్తారా?

Satyam NEWS

Leave a Comment