అన్నపూర్ణ స్డూడియోలో మూడు రోజుల ముందే సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అన్నపూర్ణ స్డూడియోలో పని చేసే ఉద్యోగుల కోసం ప్రత్యేక బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేశారు. నాగ సుశీల, అమల తదితరులు ఫుడ్ సర్వ్ చేయగా, ఉద్యోగులు ఆరగించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున, నాగ చైతన్య, సుమంత్‌తో పాటు పలువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నాగ్ ఉద్యోగులతో కలిసి కొద్ది సేపు ముచ్చటించడంతో పాటు ఫోటోలు కూడా దిగారు.