రొంపిచర్ల మండలం రామిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన హిందూ స్మశాన వాటిక ప్రహరీ గోడ కూల్చి సంబంధిత స్థలాన్ని వైసిపి నాయకులు కబ్జా చేస్తున్నారని నరసరావుపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి డాక్టర్ అరవింద బాబు ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ వారి దుర్మార్గులకు, దౌర్జన్యాలకు,అక్రమాలకు అడ్డులేకుండా పోయిందని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసిపి నాయకులు ప్రతి రోజూ దాడులు చేస్తున్నారని ఇదేనా సరైనా పాలన అంటే అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అరాచకాలకు పాల్పడుతుందని అరవింద బాబు అన్నారు. అలాగే మాజీ మంత్రి ప్రముఖ విద్యావేత్త నారాయణ సంస్థల అధినేత నారాయణ రావుపై అనంతపురంలో వై సీపీ విద్యార్థి విభాగం చేసిన దాడిని నరసరావుపేట తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన అన్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాఖ పరంగా కొంత మంది అధికారులు అధికారపార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్న ప్రతిపక్ష పార్టీ వారిని వేధించడం అనేక కేసులు బనాయించి వేధింపులకు గురి చేయడం జరుగుతున్నదని ఆయన అన్నారు.